logo

ఘనంగా భక్తోత్సవాలు ప్రారంభం

దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో శ్రీరామనవరాత్రోవాల్లో భాగంగా సోమవారం భక్తోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

Published : 16 Apr 2024 03:22 IST

యాగశాలలో హోమం నిర్వహిస్తున్న వేద పండితులు, అర్చకులు

వేములవాడ, న్యూస్‌టుడే: దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో శ్రీరామనవరాత్రోవాల్లో భాగంగా సోమవారం భక్తోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీరాజరాజేశ్వరస్వామివారికి, శ్రీసీతారామచంద్రస్వామివార్లకు ఉదయం స్థానాచార్యుడు అప్పాల భీమాశంకర్‌శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకులు మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పంచోపనిషత్‌ల ద్వారా అభిషేకాలు, అర్చనలు తదితర పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. సాయంత్రం యాగశాల ప్రవేశం, మండప ఆరాధన, మండప దేవతా ప్రతిష్ఠ, అగ్నిప్రతిష్ఠ తదితర పూజా కార్యక్రమాలను వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

అశ్వ వాహనంపై స్వామివార్ల ఊరేగింపు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి  క్షేత్రంలో జరుగుతున్న శ్రీరామ నవరాత్రోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి అశ్వ వాహనంపై స్వామివార్లకు పెద్ద సేవ నిర్వహించారు. శ్రీపార్వతీ, రాజరాజేశ్వరస్వామివార్లు, శ్రీలక్ష్మీ సమేత అనంతపద్మనాభ స్వామివార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం స్థానాచార్యుడు అప్పాల భీమాశంకర్‌శర్మ ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. తరవాత స్వామివార్లను అశ్వ వాహనంపై పట్టణ పుర వీధుల్లో ఊరేగించారు. భారీ సంఖ్యలో భక్తులు స్వామివార్లను దర్శించుకొని తరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని