logo

తెలుగువారు రంగనాథుడి వారసులు

రామాయణంలోని ధర్మాలను యథాతథంగా ఆచరిస్తుంది తెలుగువారేనని, రాముడు, రంగనాథుడికి నిజమైన వారసులు వారేనని త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌ స్వామి అన్నారు.

Published : 16 Apr 2024 03:34 IST

భక్తురాలికి జ్ఞాపిక అందజేస్తున్న చినజీయర్‌ స్వామి

కరీంనగర్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే: రామాయణంలోని ధర్మాలను యథాతథంగా ఆచరిస్తుంది తెలుగువారేనని, రాముడు, రంగనాథుడికి నిజమైన వారసులు వారేనని త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌ స్వామి అన్నారు. కరీంనగర్‌ పద్మనాయక కల్యాణ మండపంలో వసంత నవరాత్రోత్సవాలలో భాగంగా స్వామిజీ ప్రవచనాలు చెప్పారు. అయోధ్య ప్రజా సంక్షేమం కోసం ఉంటే, లంక నగర స్వార్థం కోసం ఉండేదని తెలిపారు. ఉదయం శ్రీమద్రామాయణ హవనం, తీర్థగోష్ఠి, మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ జరిగింది. కార్యక్రమంలో చల్మెడ లక్ష్మీనరసింహరావు, వీర్ల ప్రభాకర్‌రావు, కలకొండ గౌతమరావు, బీవీ.రావు, యాద కిషన్‌, ఎల్‌.భూపతిరావు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని