logo

లైట్లు లేవు... ఏసీలు పనిచేయవు

జగిత్యాల జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఆపరేషన్‌ థియేటర్లలో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Published : 03 May 2024 03:00 IST

జగిత్యాల, న్యూస్‌టుడే: జగిత్యాల జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఆపరేషన్‌ థియేటర్లలో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆసుపత్రిలో మూడు ఆపరేషన్‌ థియేటర్లు ఉండగా మూడింటిలో ఏసీలు పనిచేయకపోగా కనీసం లైట్లు కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రతిరోజు కనీసం అయిదారు శస్త్రచికిత్సలు జరుగుతుండగా రోగుల సంగతి అటుంచి వైద్యులు, సిబ్బంది సైతం ప్రస్తుత వేసవిలో చెమటలు కక్కాల్సి వస్తోంది. లైట్లు లేకపోవడంతో కిటికీలు, సెల్‌ఫోన్‌ వెలుతురు దిక్కవుతోంది. ప్రధాన ఆసుపత్రిని వైద్య కళాశాలకు అనుసంధానించగా పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని