logo

సీఎం సభకు విస్తృత ఏర్పాట్లు

ఎండపల్లి మండల పరిధిలోని రాజారాంపల్లిలో శుక్రవారం నిర్వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచార సభ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Published : 03 May 2024 03:11 IST

సభావేదిక వద్ద కాంగ్రెస్‌ నాయకులు

వెల్గటూరు, న్యూస్‌టుడే: ఎండపల్లి మండల పరిధిలోని రాజారాంపల్లిలో శుక్రవారం నిర్వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచార సభ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి గడ్డం వంశీకి మద్దతుగా పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌ఛార్జి మంత్రి శ్రీధర్‌బాబు, కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డిల పర్యవేక్షణలో ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ గురువారం పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో మొదటి సారి ఈ ప్రాంతానికి వస్తున్న రేవంత్‌రెడ్డి సభకు జనాలు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు ఉత్సాహంగా ఉన్నారని పేర్కొన్నారు. షెడ్యూల్‌ ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ సభ ప్రారంభమవుతుందన్నారు.

భద్రతా ఏర్పాట్ల పరిశీలన: ఎండపల్లి మండలం రాజారాంపల్లెలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్‌ సింగ్‌ గురువారం పరిశీలించారు. బహింరంగ సభ జరిగే ప్రదేశం, హెలిక్యాప్టర్‌ రూట్‌ మ్యాప్‌, వీఐపీ పార్కింగ్‌లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఏఎస్పీ శివం, డీఎస్పీ రఘుచందర్‌, సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్సై ఉమాసాగర్‌ తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని