logo

ఆ రెండు పార్టీలకు ఓటేసి మోసపోవద్దు

ఎన్నికల్లో ఆశీర్వదించి పార్లమెంటుకు పంపితే ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకనవుతానని భారాస కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు.

Published : 04 May 2024 04:38 IST

ఇల్లంతకుంట, న్యూస్‌టుడే: ఎన్నికల్లో ఆశీర్వదించి పార్లమెంటుకు పంపితే ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకనవుతానని భారాస కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఇల్లంతకుంట మండల కేంద్రంలో రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయిదేళ్లు ఎంపీగా ఉన్న బండి సంజయ్‌ చేసిన అభివృద్ధి ఏమీలేదన్నారు. భాజపా పదేళ్లలో చేసింది ఏమీ చెప్పుకోలేక దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్‌ పార్టీ రైతులను, ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి పరాభవం తప్పదని ఆయన అభిప్రాయపడ్డారు. భారాస పదేళ్ల పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి సాధించిందన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్‌, భాజపాలకు ఓట్లు వేసి మోసపోవద్దని ఓటర్లను కోరారు. పార్లమెంటు ఎన్నికల్లో భారాసకు ఓటు వేస్తే కొట్లాడి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానన్నారు. భాజపాకు ఓటు వేస్తే విధ్వంసమేనని ఆయన పేర్కొన్నారు. విధ్వంసం కావాలా, అభివృద్ధి కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు. మాజీ శాసనసభ్యుడు రసమయి బాలకిషన్‌ మాట్లాడుతూ  కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ప్రాజెక్టులు ఎండిపోయి కరవు వచ్చిందన్నారు. అమలు కాని హామీలతో కాంగ్రెస్‌ పార్టీ గద్దెనెక్కిందని, స్థానిక శాసన సభ్యుడు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో నాఫ్‌స్కాబ్‌ ఛైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, భారాస కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, భారాసవి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌, జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ సిద్దం వేణు, పార్టీ మండలశాఖ అధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి, వైస్‌ ఎంపీపీ శ్రీనాథ్‌గౌడ్‌, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ రొండ్ల తిరుపతిరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు ఒగ్గు నర్సయ్యయాదవ్‌, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని