logo

పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగం

జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ టీఎస్‌ దివాకర శనివారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ధర్మపురి ఫెసిలిటేషన్‌ కేంద్రంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఫెసిలిటేషన్‌ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన అన్నారు.  

Published : 05 May 2024 04:32 IST

ధర్మపురిలో ఓటు వేస్తున్న అదనపు కలెక్టర్‌ దివాకర

జగిత్యాల, ధర్మపురి గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ టీఎస్‌ దివాకర శనివారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ధర్మపురి ఫెసిలిటేషన్‌ కేంద్రంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఫెసిలిటేషన్‌ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన అన్నారు. 

ఇంటి నుంచి ఓటు వేసిన 810 మంది

జగిత్యాల, న్యూస్‌టుడే: జిల్లాలో హోం ఓటింగ్‌లో 810 మంది పాల్గొన్నారు. 85 ఏళ్లు దాటిన వృద్ధులు 40 శాతానికి మంచి అంగవైకల్యం కలిగి ఇంటి నుంచి రాలేనివారిలో ఇంటి వద్దే ఓటు వేసేందుకు 849 మంది దరఖాస్తు చేసుకోగా శుక్రవారం 320 మంది ఓటు వేయగా శనివారం 490 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరో 39 మంది ఓటు వేయాల్సి ఉంది. ఇంటి నుంచి ఓటు వేయించేందుకు జిల్లా కలెక్టర్‌ షేక్‌యాస్మిన్‌బాషా 36 బృందాలను ఏర్పాటు చేశారు. ఆది, సోమవారాల్లోనూ ఇంటి నుంచి ఓటు వేయించే కార్యక్రమం కొనసాగుతుంది. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ టీఎస్‌ దివాకర ధర్మపురి మండలం ఆరెపల్లిలో ఓ వృద్ధురాలు ఇంటి నుంచే ఓటు వేయడాన్ని పరిశీలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని