logo

‘మోసపూరిత హామీలు నమ్మొద్దు’

కాంగ్రెస్‌, భాజపాల మోసపూరిత హామీలు నమ్మొద్దని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డితో కలిసి ఏర్గట్ల, ముప్కాల్‌, మెండోరా, బాల్కొండ మండలాల్లో బుధవారం ప్రచారం నిర్వహించారు.

Published : 09 May 2024 04:56 IST

ఏర్గట్ల, మెండోరా, ముప్కాల్‌, బాల్కొండ న్యూస్‌టుడే: కాంగ్రెస్‌, భాజపాల మోసపూరిత హామీలు నమ్మొద్దని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డితో కలిసి ఏర్గట్ల, ముప్కాల్‌, మెండోరా, బాల్కొండ మండలాల్లో బుధవారం ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీల పేరుతో మోసగిస్తే, భాజపా పసుపు బోర్డు పేరుతో రైతులను నమ్మించే ప్రయత్నం చేస్తుందన్నారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్కటి పూర్తిగా అమలు కాలేదని మండిపడ్డారు. క్వింటా ధాన్యానికి రూ.500 బోనస్‌, రైతుబంధు పెంపు, కౌలు రైతులకు రూ.15వేలు వంటివి అమలు చేయలేదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకలు కావాలంటే కారు గుర్తుకు ఓటెయ్యాలని కోరారు. ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. భారాస హయాంలో అన్ని వర్గాల సంక్షేమం జరిగిందని, ఆ పనులను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆపాలని చూస్తుందని ఆరోపించారు. భాజపా ఇప్పటి వరకు రాష్ట్రానికి చేసిందేమి లేదన్నారు. ఆ రెండు పార్టీలను నమ్మి మోసపోవద్దన్నారు. బాజిరెడ్డి గోవర్ధన్‌ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమాల్లో ఎంపీపీ ఉపేందర్‌ రెడ్డి, వైస్‌ ఎంపీపీ లావణ్య, ఎంపీటీసీ సభ్యుడు మధు, భారాస మండలాధ్యక్షులు పూర్ణానందం, ముస్కు భూమేశ్వర్‌, జోగు నర్సయ్య, నాయకులు అశ్రఫ్‌, బర్మ చిన్న నర్సయ్య, సామ పద్మ, వెంకట్‌రెడ్డి, నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని