logo
Published : 03/12/2021 01:29 IST

బతుకుజీవుడా!


చెళ్లకెర వద్ద రైల్వే వంతెనకు అతుక్కున్న లారీ

చెళ్లకెర, న్యూస్‌టుడే: స్వామీ కాపాడండి! అన్న ఆర్తనాదాలతో పరిసరాల్లో ఉన్నవారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏమైందా? అని చూసేసరికి ఓ లారీ రైల్వే స్తంభానికి ఢీకొని ఉంది. లారీలో ఇరుక్కుని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని చోదకుడు సహాయం కోసం ఆరాటపడుతున్నట్లు గ్రహించారు. వెంటనే సహాయ చర్యలు చేపట్టారు. గురువారం తెల్లవారు జామున బెంగళూరు-బళ్లారి జాతీయ రహదారిలో (బళ్లారి నుంచి బెంగళూరు వెళ్తుండగా) స్థానిక హోటల్‌ వద్ద రైల్వే వంతెనకు ఢీకొని లారీ ముందుభాగం అతుక్కుపోయింది. మొళకాల్మూరు తాలూకా తిమ్మలాపురం గ్రామానికి చెందిన లారీ చోదకుడు కుమార్‌ రక్తపుమడుగులో చిక్కి విలవిలాడారు. రక్షించండి స్వామీ! అంటూ చేతులెత్తి మొక్కుతూ ప్రాధేయపడుతున్న దృశ్యాన్ని చూసిన స్థానికులు కలవరం చెందారు. పోలీసులకు విషయం చేరవేయడంతో వారు అగ్నిమాపక సిబ్బందితో హుటాహుటిన అక్కడకు వచ్చారు. సుమారు 4 గంటల పాటు క్రేన్‌, గ్యాస్‌ కట్టర్‌తో లారీని రెండు భాగాలుగా కోసి అతన్ని బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. చోదకుడి ప్రాణాలు నిలవడంతో స్థానికులు హమ్మయ్య! అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారికి ఇరువైపులా సుమారు మూడు కి.మీ. వరకు వాహనాలు నిలిచిపోయాయి. తాలూకా అగ్నిమాపక అధికారి జయన్న, సీఐ తిప్పేస్వామి, ఇతర సహాయ అధికారులను స్థానికులు అభినందించారు. చెళ్లకెర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని