logo

భారీగా చైనా డ్రోన్లు స్వాధీనం

అక్రమంగా నగరానికి తరలించుకొచ్చిన 1213 చైనా తయారీ డ్రోన్లను కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చైనా దుకాణాల నుంచి ఆన్‌లైన్‌లో నగరానికి చెందిన కొందరు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. రాష్ట్ర కస్టమ్స్, కేంద్ర హోం

Published : 05 Dec 2021 01:44 IST

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : అక్రమంగా నగరానికి తరలించుకొచ్చిన 1213 చైనా తయారీ డ్రోన్లను కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చైనా దుకాణాల నుంచి ఆన్‌లైన్‌లో నగరానికి చెందిన కొందరు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. రాష్ట్ర కస్టమ్స్, కేంద్ర హోం, రక్షణ శాఖ అధికారులు సంయుక్తంగా కార్యాచరణ నిర్వహించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని చామరాజపేటలో ఉన్న విదేశీ తపాలా కార్యాలయం (ఎఫ్‌పీఓ)లో వాటిని గుర్తించారు. స్వాధీనం చేసుకున్న వాటిలో 95 శాతం నానో సాంకేతికతతో సిద్ధం చేశారని దర్యాప్తు అధికారులు వివరించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా కొనుగోలు చేయడం సరికాదన్నారు. ఈ-కామర్స్‌ సాయంతోనే బుక్‌ చేశారని వివరించారు. ఒక్కోదాని విలువ రూ.1000 నుంచి రూ.5వేలు పలుకుతాయని కస్టమ్స్‌ అధికారులు గుర్తించారు. వాటిని ఆర్డర్‌ చేసిన వ్యక్తుల విలాసాలకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని