logo

నగదుతో ఉడాయించిన దొంగ అరెస్టు

నిత్యధన కేంద్రం (ఏటీఎం)లో నగదు నింపే ఓ వ్యక్తి నగదుతో పరారైన కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. అరెస్టు చేసిన వ్యక్తి నుంచి రూ.56.18 లక్షల నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ గురునాథ మత్తూర వెల్లడించారు. సోమవారం బ్రూస్‌పేటె పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో

Published : 24 May 2022 02:28 IST

రూ.56.18 లక్షలు పట్టివేత

మాట్లాడుతున్న ఏఎస్పీ గురునాథ మత్తూర, చిత్రంలో డీఎస్పీ రమేష్‌కుమార్‌, సీఐ హలేశ్‌, ఎస్సై సురేశ్‌, తదితరులు

బళ్లారి, న్యూస్‌టుడే: నిత్యధన కేంద్రం (ఏటీఎం)లో నగదు నింపే ఓ వ్యక్తి నగదుతో పరారైన కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. అరెస్టు చేసిన వ్యక్తి నుంచి రూ.56.18 లక్షల నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ గురునాథ మత్తూర వెల్లడించారు. సోమవారం బ్రూస్‌పేటె పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ మాట్లాడుతూ బళ్లారి నగరం మీనాక్షీ కూడలిలోని కర్ణాటక బ్యాంకు నిత్యధన కేంద్రంలో నగదును నింపడానికి కస్టోడియన్‌గా పనిచేస్తున్న నీలకంఠ(26) ఈ నెల 21న మధ్యాహ్నం 1.05గంటలకు సంచిలో ఉన్న రూ.50లక్షల నగదు, నిత్యధన కేంద్రంలో ఉన్న రూ.6.18లక్షల నగదుతో పరారైనట్లు సీఎస్‌ఎం కంపెనీ అధికారి బ్రూస్‌పేటె పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై నగర డీఎస్పీ రమేష్‌కుమార్‌, సీఐ హలేష్‌, ఎస్సైలు నాగరాజ, సురేశ్‌ , పోలీస్‌ సిబ్బంది మూడు బృందాలుగా విడిపోయి గాలింపు నిర్వహించారు. చరవాణి టవర్‌ ఆధారంగా కొప్పళ జిల్లా కేంద్రంలోని ఓ లాడ్జిలో ఉన్న నీలకంఠను అరెస్టు చేసి అతని వద్ద ఉన్న రూ.56.18లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. తమ పోలీసులు 24 గంటల్లోనే కేసును చేధించారు. నగదుతో పరారైన నీలకంఠ బళ్లారి తాలూకా మసీదిపుర గ్రామానికి చెందినట్లు గుర్తించారు. ఈ నగదుతో వేరే వ్యక్తులకు సంబంధం లేదు. కేవలం నీలకంఠ మాత్రమే బ్యాంకు నుంచి నిత్యధన కేంద్రంలో నింపడానికి రూ.50 లక్షలతో తన ద్విచక్రవాహనంపై పరారయ్యాడని, అతని వద్ద నిత్యధన కేంద్రంలోని రూ.6.18 లక్షల నగదు కూడా ఉండటంతో మొత్తం నగదుతో పాటు ద్విచక్రవాహనం, రెండు చరవాణులను స్వాధీనం చేసుకున్నామని ఏఎస్పీ వివరించారు. సకాలంలో కేసును ఛేదించిన పోలీస్‌ అధికారులు, పోలీసులను అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని