logo

ఫలితం తారుమారు.. సౌమ్యా కన్నీరు

చేతికి వచ్చింది నోటికి అందేలోగా నేలపాలైనట్లుంది సౌమ్యారెడ్డి పరిస్థితి. కర్ణాటకలో కాంగ్రెస్‌ గాలి వీచిన సమయంలో బెంగళూరు నగర పరిధి జయనగర నియోజకవర్గంలో రెండోసారి పోటీ చేసిన ఈ యువనాయకురాలు విజయం సాధించినవని అంతా భావించారు.

Published : 15 May 2023 03:57 IST

కేసీ రామమూర్తి, సౌమ్యారెడ్డి ఆవేదన

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : చేతికి వచ్చింది నోటికి అందేలోగా నేలపాలైనట్లుంది సౌమ్యారెడ్డి పరిస్థితి. కర్ణాటకలో కాంగ్రెస్‌ గాలి వీచిన సమయంలో బెంగళూరు నగర పరిధి జయనగర నియోజకవర్గంలో రెండోసారి పోటీ చేసిన ఈ యువనాయకురాలు విజయం సాధించినవని అంతా భావించారు. ఇక అధికారికంగా ప్రకటించడమే తరువాయి.. ఈలోగా భాజపా నేతలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మధ్యాహ్నం రెండుగంటల సమయానికి 160 ఓట్ల తేడాతో ఆమె విజయం సాధించారని ప్రసార మాధ్యమాలు ప్రకటించేశాయి. ప్రత్యర్థి భాజపా అభ్యర్థి కేసీ రామమూర్తి ఈ ప్రసారాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లి.. పోస్టల్‌ ఓట్ల రీ కౌంటింగ్‌కు పట్టుపట్టారు. ఆదివారం అర్ధరాత్రి ఆయన డిమాండును అధికారులు అంగీకరించి లెక్కింపునకు సిద్ధమైనవేళ.. కౌంటింగ్‌ కేంద్రం వెలుపల ఇరుపార్టీల కీలక నేతలు మొహరించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బెంగళూరు నగర జిల్లా ఎన్నికల అధికారి తుషార్‌గిరినాథ్‌ సమక్షంలో మూడు సార్లు ఓట్లు లెక్కించారు. చివరికి భాజపా అభ్యర్థి కేసీ రామమూర్తికి 57797 ఓట్లు రాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి సౌమ్యారెడ్డికి 57781 ఓట్లు దక్కినట్లు ప్రకటించారు. రామమూర్తి 16 ఓట్ల మైజార్టీతో గెలుపొందారని ప్రకటించారు. అప్పటి వరకు విజయానందంలో మునిగితేలిన కాంగ్రెస్‌ అభ్యర్థి సౌమ్యారెడ్డి కంటతడి పెడుతూ కారు ఎక్కి ఇంటికి పయనమయ్యారు. ఇది అధికారుల చీకటి నిర్ణయమంటూ కాంగ్రెస్‌ కార్యకర్తలు నినదించారు. ఓట్ల లెక్కింపుపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని కాంగ్రెస్‌ నేతలు ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని