logo

భాజపాతో అన్నింటా అన్యాయం

కలబురగి లోక్‌సభ అభ్యర్థి రాధాకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓటర్లకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మల్లికార్జున ఖర్గే ఓటమితో ఈ ప్రాంతం చాలా నష్టపోయిందన్నారు.

Updated : 25 Apr 2024 06:51 IST

కలబురగి సభలో సిద్ధు ధ్వజం

అభివాదం చేస్తున్న సిద్ధరామయ్య

కలబురగి, న్యూస్‌టుడే : కలబురగి లోక్‌సభ అభ్యర్థి రాధాకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓటర్లకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మల్లికార్జున ఖర్గే ఓటమితో ఈ ప్రాంతం చాలా నష్టపోయిందన్నారు. కలబురగిలో పార్టీ అభ్యర్థి రాధాకృష్ణకు మద్దతుగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కలిసి బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించని భాజపా నాయకులకు ఓటుతో గుణపాఠం చెప్పాలని కోరారు. కల్యాణ కర్ణాటక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని తమ ప్రభుత్వం రూ.5 వేల కోట్లను గత బడ్జెట్లో ప్రకటించినట్లు సిద్ధు వివరించారు. పదేళ్లలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కర్ణాటకకు అన్యాయం చేస్తూ వచ్చారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీ పథకాలనే తమ పథకాలుగా చెప్పుకొనేందుకు భాజపా ప్రయత్నిస్తోందని విమర్శించారు. భాజపా అంటేనే అబద్ధాలను సృష్టించే కార్ఖానాగా తప్పుపట్టారు. కర్ణాటకకు విడుదల కావలసిన కరవు పరిహారం కోసం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. మంత్రులు శరణ ప్రకాశ్‌ పాటిల్‌, ప్రియాంక్‌ ఖర్గే, పార్టీ నాయకులు మాలికయ్య గుత్తేదార్‌, అజయ్‌ సింగ్‌, హెచ్‌ఎం రేవణ్ణ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని