logo

లొంగుబాటుకు హెచ్‌డీ రేవణ్ణ ముహూర్తం.. ఇంట్లో తలుపు వేసుకుని..

మాజీ మంత్రి హొళెనరసీపుర నియోజకవర్గం ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణకు పూజలు, హోమాలు అంటే ఎక్కడిలేని నమ్మకం.

Updated : 05 May 2024 08:34 IST

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : మాజీ మంత్రి హొళెనరసీపుర నియోజకవర్గం ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణకు పూజలు, హోమాలు అంటే ఎక్కడిలేని నమ్మకం. చేతిలో, జేబులో నిమ్మకాయ లేనిదే ఆయన ఇంటి గడప దాటరు. ప్రతి పనికీ ముహూర్తం, రాహుకాలం, యమగండ కాలాన్ని చూసుకుంటారు. తన తండ్రి, మాజీ ప్రధాని దేవేగౌడ నివాసంలో ఉన్న ఆయనను అరెస్టు చేసేందుకు సిట్ అధికారులు సాయంత్రం 5.15కు వచ్చారు. సాయంత్రం 5.17 నుంచి 6.50 వరకు సరైన సమయం కాదని, ఇంట్లో తలుపు వేసుకుని కూర్చున్నారు. సాయంత్రం 6.50 తర్వాత ఆయనే తలుపు తీసి, సిట్ అధికారుల ముందు లొంగిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని