logo

అక్క ఇంట్లో చెల్లి చోరీ!

సొంత సోదరి ఇంట్లో నగదు, బంగారు నగలు చోరీ చేసిన చెల్లి- లగ్గెరె నివాసి ఉమాను కెంగేరి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఆమె నుంచి రూ.51.90 లక్షల విలువ చేసే సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు కమిషనర్‌ దయానంద్‌ విలేకర్లకు వివరించారు.

Published : 08 May 2024 02:04 IST

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : సొంత సోదరి ఇంట్లో నగదు, బంగారు నగలు చోరీ చేసిన చెల్లి- లగ్గెరె నివాసి ఉమాను కెంగేరి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఆమె నుంచి రూ.51.90 లక్షల విలువ చేసే సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు కమిషనర్‌ దయానంద్‌ విలేకర్లకు వివరించారు. నాగదేవనహళ్లి నివాసి, సిమెంట్‌ ఇనుము వ్యాపారి కున్నెగౌడ (ఉమా అక్క భర్త) ఇంట్లో ఆమె దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. గత నెల 22న కున్నెగౌడ సొంత ఊరులో చౌడేశ్వరిదేవి ఉత్సవాల్లో పాల్గొనేందుకు కుటుంబసభ్యులతో కలిసి వెళ్లారు. ఆ సమయంలో ఇంటి తాళాలను ఉమాకు ఇచ్చి రాత్రిపూట ఇక్కడే ఉండాలని సూచించారు. 24న ఉదయం ఆయనకు పోలీసుల నుంచి ఫోన్‌కాల్‌ వచ్చింది. ఇంట్లో దొంగలు పడ్డారని సమాచారం అందించారు. ఆయన వచ్చి చూసి.. దొంగల పాలైన సొత్తు విషయం పోలీసులకు వివరించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఉమాను విచారించారు. వారి ప్రశ్నలకు భయపడి ‘నేనే నేరం చేశా’నంటూ అంగీకరించింది. నకిలీ తాళాలతో బీరువా తీసి సొత్తు ఎత్తుకెళ్లి, దాచేసినట్లు వివరించింది.


శిక్ష పడకపోతే.. బుద్ధి మారదు

మైసూరు, న్యూస్‌టుడే: లైంగిక వేధింపులు, లైంగిక దౌర్జన్యం, అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్‌ను అరెస్టు చేసి, శిక్షించాలని ఒక బాధితురాలి సోదరి (పేరు అప్రస్తుతం..) డిమాండు చేసింది. ఒక వీడియోలో తన సోదరి అక్క ఉండటాన్ని చూసి కంగుతిన్నానని ఆమె చెప్పారు. ఆమె మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయమై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తుందన్న భయంతో భవానీ రేవణ్ణకు బంధువు సతీశ్‌ బాబణ్ణతో అపహరించి, ఒక ఫారంహౌస్‌లో దాచి పెట్టారని ఆక్రోశించారు. సకాలంలో పోలీసులు స్పందించడంతో తమ సోదరి ప్రాణాలతో బయటపడిందన్నారు. ప్రజ్వల్‌ను అరెస్టు చేయకపోతే, ఇటువంటి అకృత్యాలను మళ్లీ చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు