logo

టేకూరు కృష్ణమూర్తి పేరిట తపాలా కవర్‌

భారతీయ రెడ్‌క్రాస్‌ సంస్థ, తపాలా శాఖ,  మేధా డిగ్రీ కళాశాల, విమ్స్‌ ఆసుపత్రి, స్పందన చారిటబుల్‌ ట్రస్ట్‌ సంయుక్తంగా గురువారం శ్రీ మేధా డిగ్రీ కళాశాల సభాభవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా పాలనాధికారి ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా

Published : 10 May 2024 02:06 IST

టేకూరు కృష్ణమూర్తి పోస్టర్‌ కవర్‌ను విడుదల చేస్తున్న జిల్లా పాలనాధికారి ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా,
ఎస్పీ రంజిత్‌కుమార్‌ బండారు డా.టేకూరు రామ్‌నాథ్‌,డా.మహిపాల్‌, ఎం.ఎ.షకీబ్‌ తదితరులు

బళ్లారి, న్యూస్‌టుడే:  భారతీయ రెడ్‌క్రాస్‌ సంస్థ, తపాలా శాఖ,  మేధా డిగ్రీ కళాశాల, విమ్స్‌ ఆసుపత్రి, స్పందన చారిటబుల్‌ ట్రస్ట్‌ సంయుక్తంగా గురువారం శ్రీ మేధా డిగ్రీ కళాశాల సభాభవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా పాలనాధికారి ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జిల్లా పోలీస్‌ అధికారి రంజిత్‌కుమార్‌ బండారు, వైద్యులు డా.టేకూరు రామ్‌నాథ్‌ హాజరై టేకూరు కృష్ణమూర్తి పేరు మీద తయారు చేసిన తపాలా కవర్‌ను విడుదల చేశారు. జిల్లా పాలనాధికారి ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా మాట్లాడుతూ రెడ్‌క్రాస్‌ సంస్థ చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాలను వివరించారు. భారతీయ రెడ్‌ క్రాస్‌ సంస్థ సభ్యులు టేకూరు కృష్ణమూర్తి పేరు మీద పోస్టల్‌ కవర్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈసీ సభ్యులు డా.నాగరాజ్‌రావ్‌, సభ్యులు ఎం.ఎ.షకీబ్‌, కళాశాల ప్రధాన ఆచార్యుడు డా.రామకిరణ్‌, డా.మహిపాల్‌, చంద్రశేఖర్‌, కప్పగల్లు వీరేల్‌, దేవణ్ణ పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన రక్తదాన శిబిరంలో 100 మంది విద్యార్థులు రక్తదానం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని