logo

డెంగీ లక్షణాలతో బాలుడి మృతి

డెంగీ లక్షణాలతో మృతి చెందిన బాలుడు మృతదేహాన్ని బుధవారం రాత్రి ఆసుపత్రి వద్ద పెట్టి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేయడం తెలిసిందే.

Published : 10 May 2024 02:08 IST

ప్రైవేటు వైద్యుడిపై కేసు నమోదు

బాలుడి కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా పాలనాధికారి కార్యాలయం ఎదుట మౌనపోరాటం చేస్తున్న రైతు సంఘం ప్రముఖులు

హొసపేటె, న్యూస్‌టుడే: డెంగీ లక్షణాలతో మృతి చెందిన బాలుడు మృతదేహాన్ని బుధవారం రాత్రి ఆసుపత్రి వద్ద పెట్టి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేయడం తెలిసిందే. విషయం తెలిసిన వెంటనే స్థానిక శాసనసభ్యుడు హెచ్‌.ఆర్‌.గవియప్ప ఆసుపత్రికి చేరుకుని తల్లిదండ్రులను పరామర్శించారు. అనంతరం మృతికి కారణాలను వైద్యుడి నుంచి అడిగి తెలుసుకున్నారు. ‘మీ ఆసుపత్రిపైన చాలా ఫిర్యాదులు ఉన్నాయి, పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. అక్కడే ఉన్న జిల్లా వైద్యశాఖ అధికారిని ఉద్దేశించి ఆసుపత్రి వైద్యుడిపైన పోలీస్‌ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. బాలుడి అంత్యక్రియలకు రూ.50వేలు అందించారు. ప్రైవేటు వైద్యుడు సరైన చికిత్స ఇవ్వకపోవడంతో బాలుడు మృతిచెందాడని అతని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హొసపేటె అమరావతిలోని శరణం ఆసుపత్రి వైద్యుడు వినయ్‌ రాఘవేంద్రపైన గ్రామీణ ఠాణాలో కేసు నమోదైంది. వైద్యుడి నిర్లక్ష్యంతోనే నా కొడుకు గౌతమ్‌ మృతిచెందాడని తల్లి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై జిల్లా పాలనాధికారి ఎం.ఎస్‌.దివాకర్‌ స్పందించారు. విచారణ చేపట్టి నివేదిక అందివ్వాలని జిల్లా వైద్యశాఖ అధికారికి సూచించారు.

రైతు సంఘం ఆందోళన: వైద్యుల నిర్లక్ష్యంతో బాలుడు గౌతమ్‌ మృతిచెందాడని ఆరోపిస్తూ కర్ణాటక ప్రాంతం రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు, బాలుడి కుటుంబ సభ్యులు గురువారం జిల్లా పాలనాధికారి కార్యాలయం ఎదుట మౌనపోరాటం చేశారు. ఈ సందర్భంగా గాళెప్ప, తదితరులు మాట్లాడుతూ హొసపేటెలోని శరణం ఆసుపత్రిలో ఇలాంటి చాలా ఘటనలు చోటు చేసుకున్నాయి. వెంటనే విచారణ చేయించి, ఆసుపత్రి రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలని కోరారు. జిల్లా పాలనాధికారికి వినతిపత్రం సమర్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని