logo

తల్లీ, కుమారుడి సాధన

ఈసారి పదో తరగతి పరీక్షలు రాసిన జ్యోతి (38), ఆమె కుమారుడు సీబీ నితిన్‌ ఇద్దరూ ఉత్తీర్ణత సాధించారు. నితిన్‌ ఏ+ గ్రేడుతో 582 మార్కులు దక్కించుకోగా, అతని తల్లి టీఆర్‌ జ్యోతి 250 మార్కులతో సీ గ్రేడులో ఉత్తీర్ణులయ్యారు.

Published : 10 May 2024 02:10 IST

జ్యోతి, నితిన్‌

హాసన, న్యూస్‌టుడే : ఈసారి పదో తరగతి పరీక్షలు రాసిన జ్యోతి (38), ఆమె కుమారుడు సీబీ నితిన్‌ ఇద్దరూ ఉత్తీర్ణత సాధించారు. నితిన్‌ ఏ+ గ్రేడుతో 582 మార్కులు దక్కించుకోగా, అతని తల్లి టీఆర్‌ జ్యోతి 250 మార్కులతో సీ గ్రేడులో ఉత్తీర్ణులయ్యారు. ఆలూరు తాలూకా చిన్నళ్లి గ్రామానికి చెందిన జ్యోతి పెళ్లికి ముందు పది ఉత్తీర్ణత సాధించలేదు. తన కుమారుడితో పాటు ఈసారి పదిలో ఉత్తీర్ణత సాధించేందుకు కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే చదువుకుంది. ఆమె కుమారుడు నితిన్‌ సకలేశపుర తాలూకా బాళ్లుపేట వివేక్‌ కాన్వెంట్లో చదువుకుని ఉత్తమ ఫలితాన్ని అందుకున్నారు. భార్య, కుమారుడు ఒకేసారి ఉత్తీర్ణత సాధించడం తనకు సంతోషంగా ఉందని చిన్నళ్లి నివాసి భువనేశ్‌ తన హర్షాన్ని వ్యక్తం చేశారు.


పాపం.. ఉత్తీర్ణురాలైనా..

మండ్య, న్యూస్‌టుడే : పదో తరగతి పరీక్షల్లో తాను ఉత్తీర్ణురాలైనా, ఉత్తీర్ణత సాధించలేదని భావించి అమృత అనే విద్యార్థిని గురువారం బలవన్మరణానికి పాల్పడింది. హులిగెపుర గ్రామానికి చెందిన ఆమె నగరకెరె గ్రామంలోని ఒక పాఠశాలలో చదువుతూ 353 మార్కులతో 57 శాతాన్ని దక్కించుకుంది. తాను ఉత్తీర్ణత సాధించలేదని బాధతో తన గదికి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మద్దూరు ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని