logo

కొవిడ్‌ కట్టడికి సన్నద్ధం కావాలి: మంత్రి అజయ్‌

కొవిడ్‌ ఉద్ధృతి, ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని విధాలా సేవలు అందించేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ సంసిద్ధంగా ఉండాలని   మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ఆదేశించారు. జిల్లా ఆస్పత్రితోపాటు అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో అందుకోసం

Published : 19 Jan 2022 05:48 IST

మాట్లాడుతున్న మంత్రి అజయ్‌కుమార్‌. చిత్రంలో కలెక్టర్‌ గౌతమ్‌, సీపీ విష్ణు వారియర్‌, తాతా మధు, కమల్‌రాజు, మేయర్‌ నీరజ, తదితరులు

ఈటీవీ, ఖమ్మం: కొవిడ్‌ ఉద్ధృతి, ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని విధాలా సేవలు అందించేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ సంసిద్ధంగా ఉండాలని   మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ఆదేశించారు. జిల్లా ఆస్పత్రితోపాటు అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో అందుకోసం ఏర్పాట్లు చేయాలని సూచించారు. వైరస్‌ వేగంగా విస్తరిస్తున్నందున ప్రజలు మరోసారి స్వీయ రక్షణ పాటించాలని.. అర్హులందరూ టీకా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కొవిడ్‌ నివారణ చర్యలు, ఆక్సీజన్‌ నిల్వలు, పడకలు, ఔషధాలు తదితర అంశాలపై మంగళవారం ఆయన జడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా అధిక ఫీజులు వసూలు చేయకుండా యాజమాన్యాలతో చర్చించాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా చూడాలన్నారు. జిల్లా ఆస్పత్రి కమిటీ సమావేశం ప్రతీ నెలా కచ్చితంగా నిర్వహించాలని సూచించారు. వ్యాక్సినేషన్‌ రెండో డోసు ఈ నెలాఖరు లోగా వంద శాతం పూర్తి చేయాలన్నారు.  జిల్లాలో త్వరలోనే వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావు పర్యటన ఉంటుందన్నారు.  అనంతరం చింతకాని మండలంలో దళితబంధు పథకం అమలుపై మంత్రి సమీక్షించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పథకంతో దళిత కుటుంబాల్లో వెలుగు నింపేలా అధికారులు దిశానిర్దేశం చేయాలన్నారు.  సమీక్షలో ఎమ్మెల్సీగా ఎన్నికైన  తాతా మధుసూదన్‌,   జడ్పీ ఛైర్మన్‌ కమల్‌రాజు, కలెక్టర్‌ గౌతమ్‌, సీపీ విష్ణు.ఎస్‌.వారియర్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ ఆదర్శ్‌ సురభి, మేయర్‌ పునుకొల్లు నీరజ తదితరులు పాల్గొన్నారు.    

నేడు మంత్రి పర్యటన

ఖమ్మం నగరపాలకం: మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ జిల్లాలో బుధవారం పర్యటించనున్నారు. ఉదయం ఖమ్మం నగరంలోని పలు కాలనీల్లో సీసీ రహదారులను ప్రారంభిస్తారు. అనంతరం రఘునాధపాలెం మండలం గణేశ్వరం, గేట్‌కారేపల్లి, కొత్తగూడెం కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశాల్లో పాల్గొంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని