logo

నిధులు ఖర్చు చేయకుంటే వెనక్కే!

ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు కేంద్రా, రాష్ట్ర ప్రభుత్వాలు పలు దఫాలుగా నిధులు మంజూరు చేస్తాయి.

Published : 26 Mar 2023 03:39 IST

కొత్తగూడెం పట్టణం సింగరేణి కాలరీస్‌ హైస్కూల్‌లో శిక్షణ కల్పిస్తున్న డీఈఓ కార్యాలయం సిబ్బంది

కొత్తగూడెం విద్యావిభాగం, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు కేంద్రా, రాష్ట్ర ప్రభుత్వాలు పలు దఫాలుగా నిధులు మంజూరు చేస్తాయి. విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని నిర్ణీత మొత్తాన్ని విద్యాలయాల ఖాతాలకు జమ చేస్తుంది. 2023-24 విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి మార్చి మొదటి వారం వరకు వివిధ గ్రాంట్ల రూపంలో నిధులు కేటాంచారు. సీఆర్పీలు, మండల విద్యా వనరుల కేంద్రాల నిర్వహణ, క్రీడలు, విజ్ఞాన ప్రదర్శనలు, మధ్యాహ్న భోజన పథకం, సుద్ద ముక్కలు, తెల్లకాగితాలు, హాజరు పట్టికలు, ఇతర సామగ్రి, ఏ అవసరం ఉన్నా నిధులు వినియోగించుకోవాలి. ఇటీవల క్రీడా సామగ్రి కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. నిర్ణీత వ్యవధిలో నిబంధనలకు అనుగుణంగా చేసిన వ్యయాల వివరాలను ‘పబ్లిక్‌ ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం’(పీఎఫ్‌ఎంఎస్‌)లో బిల్లులు, ఇతరాలను పొందుపరచాలి. ఈ విషయమై ఇటీవల వరకు మండల విద్యా శాఖాధికారులతో ఉన్నతాధికారులు సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించారు. కాంప్లెక్స్‌ల వారీగా సూచనలు చేశారు. ఈ నెలాఖరు దాటితే ఖాతాల్లోంచి నిధులు వెనక్కి వెళ్లిపోనున్నాయి. ‘నిధులను నిబంధనల ప్రకారం పారదర్శకంగా వినియోగించుకోవాలి. ఎస్‌ఎంసీ కమిటీ తీర్మానం అవసరం. ఏ అవసరాలున్నా అందుబాటులో ఉన్న నిధులతో నెలాఖరులుగా సమకూర్చుకోవాలి. క్రీడా సామగ్రి కొనుగోలు చేయాలి. నిధుల వినియోగంపై శిక్షణ ఇచ్చామని’ డీఈఓ సోమశేఖర్‌శర్మ ‘న్యూస్‌టుడే’తో అన్నారు.


ఏఏ నిధులు ఎన్ని..

* మొత్తం పాఠశాలలు: 1,233  
* నిర్వహణ గ్రాంట్లు: రూ.1.36 కోట్లు
* సీఆర్పీల (90) జీతభత్యాలు: రూ.14.85 లక్షలు
* ఎమ్మార్సీలకు(17)..: రూ.7.65 లక్షలు
* స్పోర్ట్స్‌ ఖర్చులు: రూ.1.11 కోట్లు  

(నోట్‌: మధ్యాహ్న భోజన నిర్వహణ, ఏకరూప దుస్తుల కుట్టుకూలీ నిధులు విడుదలయ్యాయి..)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని