logo

రామయ్య హుండీలో కాసుల గలగల..!

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలోని మూడు రకాల హుండీలు కాసులతో కళకళలాడాయి. 26 రోజుల హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. జనరల్‌ హుండీల ద్వారా రూ.71,22,878 సమకూరింది.

Published : 28 Mar 2024 01:28 IST

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలోని మూడు రకాల హుండీలు కాసులతో కళకళలాడాయి. 26 రోజుల హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. జనరల్‌ హుండీల ద్వారా రూ.71,22,878 సమకూరింది. అన్నదానానికి రూ.1,61,100, గోశాల విస్తరణకు రూ.1,95,363 లభించింది. మొత్తంగా 74,79,341 వచ్చినట్లు ఆలయాధికారులు ప్రకటించారు. యూఎస్‌ డాలర్లు 270, కెనడా డాలర్లు 50, మలేషియా రింగిట్స్‌ 20, వియత్నాం డాంగ్స్‌ 2వేలు సమకూరాయి. కానుకలను ఈఓ రమాదేవి బ్యాంకులో జమచేశారు. తలంబ్రాలను కలిపే వేడుకకు విశేషసంఖ్యలో భక్తులు రావడంతో పాటు మార్చి మొదటి నుంచి రద్దీ ఉండడంతో కానుకలు ఆశాజనకంగా వచ్చినట్లు భావిస్తున్నారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని