logo

ప్రభుత్వ ఆస్తి ధ్వంసం కేసులో రెండేళ్ల జైలు

తిరుమలాయపాలెం మండలం జూపెడ గ్రామంలో సిమెంట్‌ రోడ్డును ధ్వంసం చేసిన కేసులో నిందితుడు ఎలక వెంకటేశ్వర్లుకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఖమ్మం ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి పి.గోపిక నాగశ్రావ్య సోమవారం తీర్పు చెప్పారు.

Published : 16 Apr 2024 02:01 IST

ఖమ్మం న్యాయవిభాగం, న్యూస్‌టుడే: తిరుమలాయపాలెం మండలం జూపెడ గ్రామంలో సిమెంట్‌ రోడ్డును ధ్వంసం చేసిన కేసులో నిందితుడు ఎలక వెంకటేశ్వర్లుకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఖమ్మం ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి పి.గోపిక నాగశ్రావ్య సోమవారం తీర్పు చెప్పారు. ఫిర్యాది వి.హనుమంతరావు కథనం ప్రకారం... జూపెడలో 6-3-2017న నిందితుడు రాత్రి 11 గంటల సమయంలో తన ఇంటి ముందున్న సీసీ రోడ్డును 10 మీటర్ల వరకు ధ్వంసం చేశాడని తిరుమలాయపాలెం పోలీసులకు ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసి, పోలీసులు కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. కేసును విచారించిన న్యాయమూర్తి నిందితుడిపై నేరం రుజువు కావడంతో పైవిధంగా శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ తరపున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వి.నర్సయ్య, లైజన్‌ ఆఫీసర్‌ ఎల్‌.భద్రునాయక్‌ సహకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని