logo

నవమికి 238 ప్రత్యేక బస్సులు

తెలంగాణలోనే అత్యంత వైభవంగా జరగనున్న భద్రాచలం సీతారామ కల్యాణ మహోత్సవానికి(శ్రీరామ నవమి) హాజరు కానున్న భక్తుల కోసం ఆర్టీసీ ఆధ్వర్యంలో 238 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ప్రాంతీయ మేనేజర్‌ సీహెచ్‌ వెంకన్న తెలిపారు.

Published : 16 Apr 2024 02:11 IST

సమావేశంలో మాట్లాడుతున్న ఆర్‌ఎం సీహెచ్‌ వెంకన్న

ఖమ్మం కమాన్‌బజార్‌, న్యూస్‌టుడే: తెలంగాణలోనే అత్యంత వైభవంగా జరగనున్న భద్రాచలం సీతారామ కల్యాణ మహోత్సవానికి(శ్రీరామ నవమి) హాజరు కానున్న భక్తుల కోసం ఆర్టీసీ ఆధ్వర్యంలో 238 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ప్రాంతీయ మేనేజర్‌ సీహెచ్‌ వెంకన్న తెలిపారు. ఖమ్మం నూతన బస్టాండ్‌లో సోమవారం అన్ని డిపోల మేనేజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నవమికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. గతానుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. భద్రాచలంలో వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో తరలే అవకాశం ఉన్నందున అన్ని ప్రధాన బస్టాండ్ల నుంచి ఈ నెల 16 నుంచి 18 వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ప్రత్యేక బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు వివరించారు.

  • భద్రాచలం బస్టాండ్‌ నుంచి పర్ణశాలకు రెగ్యులర్‌గా నడుపుతున్న బస్సులతో పాటు ప్రతి ఐదు నిమిషాలకు ఒకటి అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
  • ఖమ్మం రీజియన్‌ నుంచి నడుపుతున్న అన్ని ప్రత్యేక బస్సులు భద్రాచలం బస్టాండ్‌ వరకు వెళ్తాయని తెలిపారు. ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సులను భద్రాచలం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వరకు అనుమతించనున్నట్లు ప్రకటించారు. అక్కడి నుంచి బస్టాండ్‌ వరకు మినీ బస్సులను నడపనున్నట్లు పేర్కొన్నారు. మినీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా, ఇతరులకు రూ.10 ఛార్జీలు వసూలు చేస్తామని స్పష్టం చేశారు. భద్రత దృష్ట్యా ఇతర రీజియన్ల నుంచి 40 మంది సెక్యూరిటీ సిబ్బందికి విదులు కేటాయించినట్లు చెప్పారు. తాగునీరు, శౌచాలయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు, భక్తులకు ఆరోగ్యపరమైన సేవలందించేందుకు సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ గిరిసింహారావు ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. డిప్యూటీ ఆర్‌ఎంలు పవిత్ర, భవానీ ప్రసాద్‌, డీఎంలు పాల్గొన్నారు.

నియమితులైన అధికారులు

భద్రాచలం-99592 25961(డీఎం మధిర), 99592 25960(డీఎం భద్రాచలం), పర్ణశాల-99592 25963(డీఎం మణుగూరు), భద్రాచలం జూనియర్‌ కళాశాల-99592 25962(డీఎం సత్తుపల్లి), కొత్తగూడెం-99592 25959(డీఎం కొత్తగూడెం), ఖమ్మం-99592 25958(డీఎం ఖమ్మం), మణుగూరు-73828 58121(అసిస్టెంట్‌ మేనేజర్‌ మణుగూరు), సత్తుపల్లి- 63035 61217(అసిస్టెంట్‌ మేనేజర్‌ సత్తుపల్లి), మధిర-87900 14668(సూపరింటెండెంట్‌ మధిర).

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని