logo

గుండెపోటుతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

గుండెపోటుతో యువ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు మృతి చెందిన ఘటన రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెంలో మంగళవారం చోటుచేసుకుంది. నిదిగొండ భిక్షం, రామలక్ష్మి దంపతుల కుమారుడు అభిలాష్‌(30) బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పని చేస్తున్నారు.

Published : 17 Apr 2024 03:01 IST

అభిలాష్‌

రఘునాథపాలెం, న్యూస్‌టుడే: గుండెపోటుతో యువ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు మృతి చెందిన ఘటన రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెంలో మంగళవారం చోటుచేసుకుంది. నిదిగొండ భిక్షం, రామలక్ష్మి దంపతుల కుమారుడు అభిలాష్‌(30) బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పని చేస్తున్నారు. అతనికి హైదరాబాదులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పని చేస్తున్న ఖమ్మం నగరానికి చెందిన సాయితులసితో ఏడు నెలల క్రితం వివాహమైంది. వీరిద్దరూ ఉగాదికి వెంకటాయపాలెంలోని ఇంటికి వచ్చారు. సాయితులసిని సోమవారం హైదరాబాద్‌ పంపించిన అభిలాష్‌, తాను బెంగళూరు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. మంగళవారం ఉదయం ఒక్కసారిగా అస్వస్థతకు గురై పడిపోయిన అతణ్ని తక్షణమే స్థానిక గ్రామీణ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అప్పటికే పరిస్థితి విషమించటతో ఖమ్మంలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అభిలాష్‌ గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించడంతో అందరూ విషాదంలో మునిగిపోయారు.

గ్రామంలో విషాదం

అభిలాష్‌ తండ్రి భిక్షం క్షౌర వృత్తి చేస్తారు. కష్టపడి కుమార్తె వివాహం చేయడంతోపాటు, కుమారుడు అభిలాష్‌ను ఇంజినీరింగ్‌ వరకు చదివించారు. బెంగళూరులోని పనిచేస్తున్న కుమారుడికి ఇటీవలే వివాహం చేశారు. తనలా కాకుండా చదువుకుని ప్రయోజకుడైన కుమారుణ్ని చూసి భిక్షం ఆనందించారు. అంతలోనే అకాల మృత్యువు కుమారుడిని కబళించిందని తల్లిదండ్రులు రోదించిన తీరు కంటతడి పెట్టించింది. ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని