logo

ఖమ్మం బరిలో 35.. మహబూబాబాద్‌లో 23 మంది

ఖమ్మం లోక్‌సభ స్థానంలో 35 మంది, మహబూబాబాద్‌ స్థానంలో 23 మంది బరిలో నిలిచారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయా చోట్ల వరుసగా ఆరుగురు, ఇద్దరు అభ్యర్థులు తమ నామపత్రాలు ఉపసంహరించుకున్నారు.

Published : 30 Apr 2024 04:42 IST

ఈనాడు డిజిటల్‌, కొత్తగూడెం, న్యూస్‌టుడే, ఖమ్మం నగరం: ఖమ్మం లోక్‌సభ స్థానంలో 35 మంది, మహబూబాబాద్‌ స్థానంలో 23 మంది బరిలో నిలిచారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయా చోట్ల వరుసగా ఆరుగురు, ఇద్దరు అభ్యర్థులు తమ నామపత్రాలు ఉపసంహరించుకున్నారు. ఖమ్మం లోక్‌సభ స్థానంలో 35 మంది పోటీపడుతున్నందున బ్యాలెట్‌ యూనిట్లు మూడు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒక్కో బ్యాలెట్‌ యూనిట్‌పై 16 మంది అభ్యర్థుల పేర్లు ముద్రిస్తారు. అభ్యర్థుల చివరన నోటాను మూడో బ్యాలెట్‌  యూనిట్‌పై అమర్చుతారు. నామపత్రాలు ఉపసంహరించుకున్న వారిలో కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థి పోట్ల నాగేశ్వరరావు ఉన్నారు. మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానంలో 23 మంది బరిలో నిలవటంతో బ్యాలెట్‌ యూనిట్లు రెండు అవసరమవుతాయి. మే 13న పోలింగ్‌ జరగనుంది. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు