logo

మందకొడిగా ధాన్యం కొనుగోళ్లు

రబీ సీజన్‌లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు అధికారులు హడావుడి చేసి 236 కొనుగోలు కేంద్రాలు తెరచి నెల రోజులు దాటిపోయింది. ఇందులో కేవలం 70 కొనుగోలు కేంద్రాల్లో 8,760 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు.

Published : 05 May 2024 02:08 IST

ఖమ్మం నగరం, న్యూస్‌టుడే: రబీ సీజన్‌లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు అధికారులు హడావుడి చేసి 236 కొనుగోలు కేంద్రాలు తెరచి నెల రోజులు దాటిపోయింది. ఇందులో కేవలం 70 కొనుగోలు కేంద్రాల్లో 8,760 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. సత్తుపల్లి, పెనుబల్లి, వేంసూరు మండలాల్లో మాత్రమే కొంత మేరకు ధాన్యాన్ని రైతులు కేంద్రాల్లో విక్రయించారు. మరో పది రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు ముగించి, కేంద్రాలు మూసివేయనున్నారు. 1,458 మంది రైతుల నుంచి రూ.19.21 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేయగా 914 మంది రైతులకు రూ.12.43 కోట్లు చెల్లించారు. మరో 544 మంది రైతులకు రూ.6.78 కోట్లు చెల్లించాల్సి ఉంది. రైతుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. రబీ సీజన్‌లో 1.30 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించినా ఆ మేరకు దిగుబడి రాలేదు. వర్షాభావంతో వరి పంట దెబ్బతింది. రబీలో వరి దిగుబడిపై వ్యవసాయ శాఖ అంచనాలు తప్పాయి. చాలామంది రైతులు బహిరంగ మార్కెట్‌లో వ్యాపారులకు ధాన్యం విక్రయించారు. ప్రభుత్వం ఇచ్చే కనీస మద్దతు ధరకు మించి వ్యాపారులు ధాన్యం కొనుగోలు చేశారు. దీంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ఆశించిన స్థాయిలో ధాన్యం రాలేదు.

రబీలో ధాన్యం కొనుగోలకు అన్ని ఏర్పాట్లు చేశాం. పంట దిగుబడి తగ్గటంతో కేంద్రాలకు ఆశించిన స్థాయిలో రాలేదు. మరో 2 వేల మెట్రిక్‌ టన్నులు వస్తుందని అంచనా. పది రోజుల్లో కేంద్రాలు మూసేయాలని భావిస్తున్నాం. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రైతుల ఖాతాలకు నగదు జమ చేస్తున్నాం.

గంటా శ్రీలత, డీఎం, పౌరసరఫరాల సంస్థ, ఖమ్మం

ప్రతిపాదిత కొనుగోలు కేంద్రాలు: 236
తెరచినవి: 236
ధాన్యం కొనుగోలు చేసినవి: 70

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని