logo

7న సినీ నటుడు వెంకటేశ్‌ రాక

ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి వియ్యంకుడు సినీ నటుడు విక్టరీ వెంకటేష్‌ ఈనెల 7న ఖమ్మం రానున్నట్లు ప్రోగ్రాం సమన్వయకర్త తుంబూరు దయాకర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Updated : 06 May 2024 06:04 IST

ఖమ్మం కమాన్‌బజార్‌, న్యూస్‌టుడే: ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి వియ్యంకుడు సినీ నటుడు విక్టరీ వెంకటేష్‌ ఈనెల 7న ఖమ్మం రానున్నట్లు ప్రోగ్రాం సమన్వయకర్త తుంబూరు దయాకర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం నగరంలో సాయంత్రం 5 గంటలకు మయూరిసెంటర్‌ నుంచి ఇల్లెందు క్రాస్‌రోడ్డు వరకు రోడ్‌షో నిర్వహిస్తారని ప్రకటించారు. అనంతరం రాత్రి 8 గంటలకు కొత్తగూడెం పట్టణంలో క్లబ్‌లో జరగనున్న పుర ప్రముఖల సమ్మేళనానికి హాజరవుతారని వివరించారు. కాంగ్రెస్‌ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని వెంకటేష్‌ పర్యటనను జయప్రదం చేయాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని