icon icon icon
icon icon icon

BJP: రెండు పడక గదుల ఇళ్ల పేరుతో కేసీఆర్‌ మోసగించారు: జేపీ నడ్డా

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్‌ నంబర్‌ వన్‌ అవుతోందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.

Published : 06 May 2024 14:05 IST

పెద్దపల్లి: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్‌ నంబర్‌ వన్‌ అవుతుందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఫార్మా, పెట్రో కెమికల్స్‌ రంగాల్లో దేశం రెండో స్థానంలో ఉందని తెలిపారు. పెద్దపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. గతంలో మొబైళ్లు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్లమని గుర్తుచేశారు. ప్రస్తుతం మేడిన్‌ ఇండియా ఫోన్లు వాడుతున్నామన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ఐదో స్థానంలో ఉందని చెప్పారు. దేశంలో 56 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మించినట్లు నడ్డా వివరించారు. 52 వేల కిలోమీటర్ల మేర రైల్వే విద్యుదీకరణ చేసినట్లు తెలిపారు.

‘‘దేశంలో విమానాశ్రయాల సంఖ్య 148కి పెంచాం. లక్షలాది గ్రామాలకు ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించాం. 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్‌ అందిస్తున్నాం. పేదలకు 4 కోట్ల ఇళ్లు కట్టించాం. మోదీ హయాంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. రాష్ట్రానికి వందేభారత్‌ రైలు సేవలు అందించాం. రెండు పడక గదుల ఇళ్ల పేరుతో కేసీఆర్‌ మోసగించారు. కేసీఆర్‌ హామీ ఇచ్చిన 2 పడక గదుల ఇళ్లు మేం పూర్తి చేస్తాం. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనను కేసీఆర్‌ ఉపయోగించుకోలేదు. ఇప్పుడు పీఎంఏవై పథకాన్ని రేవంత్‌రెడ్డి కూడా ఉపయోగించుకోవట్లేదు’’ అని జేపీ నడ్డా విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img