logo

రైతు వ్యతిరేక ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి

రైతు వ్యతిరేక కాంగ్రెస్‌ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. ముదిగొండలో సోమవారం ప్రచారం నిర్వహించారు.

Published : 07 May 2024 02:26 IST

ముదిగొండలో మాట్లాడుతున్న నామా నాగేశ్వరరావు

ముదిగొండ, న్యూస్‌టుడే: రైతు వ్యతిరేక కాంగ్రెస్‌ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. ముదిగొండలో సోమవారం ప్రచారం నిర్వహించారు. హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్‌ సర్కారు విఫలమైందని విమర్శించారు. రైతుబిడ్డగా ప్రజలకు అందుబాటులో ఉన్నానని తెలిపారు. తనను మరోసారి గెలిపిస్తే జిల్లా, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీకి అభ్యర్థి దొరకక బయట నుంచి అరువు తెచ్చుకున్నారని విమర్శించారు. జడ్పీ  ఛైర్మన్‌ లింగాల కమల్‌రాజు, మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి, కొండబాల కోటేశ్వరరావు, పసుపులేటి దుర్గ, లక్ష్మారెడ్డి, వెంకట్, బొమ్మెర రాంమూర్తి,    బంకా మల్లయ్య, ఎర్ర వెంకన్న, తోట ధర్మారావు, తిరమలరావు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌వి మోసపూరిత వాగ్దానాలే: అజయ్‌

రఘునాథపాలెం, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ ప్రభుత్వానివి మోసపూరిత వాగ్దానాలే తప్ప ప్రజలకు సంక్షేమం పంచాలనే ఉద్దేశం లేదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆరోపించారు. భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపును కాంక్షిస్తూ రఘునాథపాలెం మండలం కేసీఆర్‌నగర్‌ వద్ద ఉపాధి పనులు చేస్తున్న కూలీలను కలిసి ఓట్లు అభ్యర్థించారు. అనంతరం బూడిదంపాడులో ఇంటింటి ప్రచారం చేశారు. శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ 420 హామీలు ఇచ్చిందే తప్ప వాటిని అమలుచేయటం లేదని చెప్పారు.  రైతుబంధు రూ.15 వేలు, కల్యాణలక్ష్మిలో తులం బంగారం ఇస్తామని మోసగించిందని విమర్శించారు.  కాంగ్రెస్‌ ఇచ్చిన ప్రతి హామీని పట్టుబట్టి అమలు చేయించే బాధ్యత భారాస  తీసుకుంటుందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. మద్దినేని వెంకటరమణ, అజ్మీరా ఈరూనాయక్‌, వల్లభనేని అప్పారావు, తుమ్మలపల్లి మోహన్‌రావు,   కుతుంబాక నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని