logo

అత్తను ఓడించాలని అల్లుడు ప్రచారం

ఎమ్మిగనూరు వైకాపా అభ్యర్థి బుట్టా రేణుకకు వ్యతిరేకంగా ఆమె కూతురు భర్త మాచాని సోమనాథ్ ప్రచారం చేయడం నియోజకవర్గంలో ఆసక్తిగా మారింది.

Updated : 20 Apr 2024 15:58 IST

ఎమ్మిగనూరు వ్యవసాయం: ఎమ్మిగనూరు వైకాపా అభ్యర్థి బుట్టా రేణుకకు వ్యతిరేకంగా ఆమె కూతురు భర్త మాచాని సోమనాథ్ ప్రచారం చేయడం నియోజకవర్గంలో ఆసక్తిగా మారింది. శనివారం కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డికి ఓటు వేయాలని ఇంటింటికి ప్రచారం చేశారు. సోమనాథ్ తెదేపా టికెట్ కోసం తీవ్రంగా యత్నించారు. చివరికి బీవీ జయనాగేశ్వరరెడ్డికి కూటమి టికెట్ ఇవ్వడంతో ఆయన గెలుపునకు ప్రచారం చేస్తున్నాడు. ప్రచారంలో నాయకులు రంగస్వామి, దేవేంద్ర పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని