logo

1 వరకు దరఖాస్తుకు గడువు

ఎన్నికల ఏజెంట్లుగా నియమించుకోవాలనుకునేవారు ఫామ్‌-8 ఇవ్వడంతోపాటు వ్యయ నిర్వహణ కోసం ఒకరిని ఏర్పాటుచేసుకోవాలని పాణ్యం ఆర్వో, జేసీ నారపురెడ్డి మౌర్య అన్నారు.

Updated : 30 Apr 2024 06:30 IST

మాట్లాడుతున్న మౌర్య

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : ఎన్నికల ఏజెంట్లుగా నియమించుకోవాలనుకునేవారు ఫామ్‌-8 ఇవ్వడంతోపాటు వ్యయ నిర్వహణ కోసం ఒకరిని ఏర్పాటుచేసుకోవాలని పాణ్యం ఆర్వో, జేసీ నారపురెడ్డి మౌర్య అన్నారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్సు హాలులో సోమవారం అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. మే 2వ తేదీ నుంచి 5 వరకు ఈవీఎం యంత్రంలో సింబల్‌ లోడింగ్‌ తదితర కార్యక్రమాలు పుల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో జరుగుతాయన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌కు సంబంధించి దరఖాస్తుల స్వీకరణకు మే 1వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని