logo

యువకుడిపై వేటకొడవలితో దాడి.. యువకుడి పరిస్థితి విషమం

ప్రేమ పేరుతో తన కుమార్తెను వేధిస్తున్నాడంటూ యుకువడిపై ఓ వ్యక్తి  దాడి చేశాడు.

Published : 06 May 2024 12:46 IST

పత్తికొండ రూరల్‌ : ప్రేమ పేరుతో తన కుమార్తెను వేధిస్తున్నాడంటూ యుకువడిపై ఓ వ్యక్తి  దాడి చేశాడు.  పత్తికొండ మండలంలోని పుచ్చకాలయ మాడలో ఓబులేసుపై అదే గ్రామానికి చెందిన సింహాద్రి అనే వ్యక్తి వేటకొడవలితో దాడికి పాల్పడ్డాడు.  తీవ్రంగా  గాయపడిన ఓబులేష్‌ను పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఓబులేష్‌పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలుకు తరలించారు. ఈ ఘటనపై పత్తికొండ సీఐ మురళీ మోహన్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని