logo

హంద్రీ తూము ఏర్పాటు చేస్తాం

కూటమి అధికారంలో రాగానే హంద్రీ కాలువపై తూము ఏర్పాటు చేసి ఏబీసీ కాలువను అభివృద్ధి చేస్తామని ఆలూరు తెదేపా  ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్ కుమారుడు మల్లికార్జున గౌడ్ అన్నారు.

Updated : 07 May 2024 15:53 IST

చిప్పగిరి: కూటమి అధికారంలో రాగానే హంద్రీ కాలువపై తూము ఏర్పాటు చేసి ఏబీసీ కాలువను అభివృద్ధి చేస్తామని ఆలూరు తెదేపా  ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్ కుమారుడు మల్లికార్జున గౌడ్ అన్నారు. మంగళవారం చిప్పగిరి మండలంలోని డేగులపాడు ఏరూరు గ్రామంలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హంద్రీ తూము ఏర్పాటు చేస్తే చిప్పగిరి, ఆల్ హరివి, ఆలూరు మండలాల్లోని దాదాపు 40 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని వారు తెలిపారు. అందుకోసం వీరభద్ర గౌడ్‌ను ఎమ్మెల్యేగా నాగరాజును ఎంపీగా ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు మీనాక్షి నాయుడు, ఏరూరు మహేష్, అమరప్ప, రాజన్న, రంగస్వామి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని