logo

తెదేపా కార్యకర్తలపై వైకాపా నాయకుల దాడి

తెదేపా కార్యకర్తలపై వైకాపా నాయకులు దాడికి పాల్పడటంతో ఐదుగురికి గాయాలైన ఘటన ఆలూరు మండలంలోని అంగసకల్లులో మంగళవారం జరిగింది.

Updated : 08 May 2024 07:11 IST

ఆలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: తెదేపా కార్యకర్తలపై వైకాపా నాయకులు దాడికి పాల్పడటంతో ఐదుగురికి గాయాలైన ఘటన ఆలూరు మండలంలోని అంగసకల్లులో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మణేకుర్తి గ్రామ పంచాయతీ మజార గ్రామమైన అంగసకల్లుకు చెందిన తెదేపా కార్యకర్తలు రామాంజనేయులు, రమేశ్‌, భీమలింగ, దేవేంద్రతో పాటు మరికొందరు మణేకుర్తిలో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ‘మీరు ప్రచారంలో ఎలా పాల్గొంటారు’ అని మంగళవారం ఉదయం అదే గ్రామానికి చెందిన వైకాపా నాయకులు దూదేకొండ వెంకటేశ్‌, నాగరాజు, ఉలిగప్ప, శ్రీనువాసులు, లింగన్న, అశోక్‌, రవితో పాటు మరికొందరు వాగ్వాదానికి దిగారు. మాటామాట పెరిగి ఇరువర్గాలు కర్రలతో దాడి చేసుకున్నాయి. ఈ దాడిలో రామాంజనేయులు, రమేశ్‌, భీమలింగ, దేవేంద్రతో పాటు మరొకరికి తలకు గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వారిని చికిత్స నిమిత్తం ఆలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు 12 మంది వైకాపా నాయకులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే తెదేపా నాయకులు సైతం తమపై దాడికి పాల్పడ్డారని బాధితులు శ్రీనివాసులు, నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 5 మందిపై కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్‌ జానీవాకర్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు