logo

ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై.. నిరంతర నిఘా

మండలంలో జీపీఆర్‌ఎస్‌తో అనుసంధానించి కెమెరాలతో ఏర్పాటు చేసిన వాహనం ద్వారా  ఎన్నికల కోడ్‌  ఉల్లంఘనలపై నిరంతర నిఘా కొనసాగిస్తున్నట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ టీం అధికారులు సుదర్శన్ రెడ్డి, బాబు భాస్కర్ తెలిపారు.

Published : 08 May 2024 13:11 IST

గోనెగండ్ల: మండలంలో జీపీఆర్‌ఎస్‌తో అనుసంధానించి కెమెరాలతో ఏర్పాటు చేసిన వాహనం ద్వారా  ఎన్నికల కోడ్‌  ఉల్లంఘనలపై నిరంతర నిఘా కొనసాగిస్తున్నట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ టీం అధికారులు సుదర్శన్ రెడ్డి, బాబు భాస్కర్ తెలిపారు. బుధవారం వారు  విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు.  తమ సిబ్బంది రెండు విడతల్లో వాహనం ద్వారా మండలంలో వివిధ పార్టీల రాజకీయ నాయకులు,  కార్యకర్తలు నిర్వహించే కార్యక్రమాలపై 24 గంటలు నిరంతర నిఘా కొనసాగిస్తారని తెలిపారు. ప్రజలు  c - vigil యాప్ ను డౌన్లోడ్ చేసుకొని అక్రమాలపై ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.  అనుమతులు లేకుండా పార్టీల జెండాలు,  స్టిక్కర్లు ప్రదర్శించినా,  డబ్బు,  మద్యం పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభాలకు గురి చేసినా  15 నిమిషాల్లోగా  ఘటనాస్థలికి చేరుకుని బాధితులపై  తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో హెడ్ కానిస్టేబుల్ ఇర్షాద్ అలీ,   కానిస్టేబుల్ మద్దిలేటి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని