logo

ఆదర్శ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో  గోనెగండ్ల, నందవరం, ఎమ్మిగనూరు మండలాల్లో  నాలుగు ఆదర్శ పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసినట్లు  ఎన్నికల రిటర్నింగ్ అధికారి చిరంజీవి తెలిపారు. 

Published : 09 May 2024 13:33 IST

గోనెగండ్ల: ఎమ్మిగనూరు నియోజకవర్గంలో  గోనెగండ్ల, నందవరం, ఎమ్మిగనూరు మండలాల్లో  నాలుగు ఆదర్శ పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసినట్లు  ఎన్నికల రిటర్నింగ్ అధికారి చిరంజీవి తెలిపారు.  గురువారం గోనెగండ్ల లోని 236వ పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి పరిశీలించారు. ఈ కేంద్రాన్ని ఆదర్శ పోలింగ్ కేంద్రంగా  తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. ఆదర్శ పోలింగ్ కేంద్రంలో ఉండవలసిన కనీస సదుపాయాలు, తాగునీరు మరుగుదొడ్లు  సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఎంపీడీవో సోనూబాయ్‌కి సూచించారు.  పోలింగ్ కేంద్రంలో చేయవలసిన చిన్న చిన్న మార్పులు చేర్పులతోపాటు  అదనపు ఏర్పాట్లను గురించి  వివరించారు. ఆయన వెంట  ప్రధానోపాధ్యాయుడు రహంతుల్లా, బీఎల్వో రంగస్వామి, ఇంజనీరింగ్ సహాయకుడు సుధీర్ తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని