logo

ఘనంగా బస్వేశ్వరస్వామి జయంతి వేడుకలు

మండల కేంద్రమైన సీబెళగల్‌లో శుక్రవారం వీరశైవ సంఘం ఆధ్వర్యంలో బసవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Updated : 10 May 2024 12:43 IST

సీబెళగల్‌: మండల కేంద్రమైన సీబెళగల్‌లో శుక్రవారం వీరశైవ సంఘం ఆధ్వర్యంలో బసవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వీరశైవ లింగాయతి కోరిశెట్టి ఈరమ్మ ఇంటి నుంచి బస్వేశ్వరస్వామి చిత్రపటాన్ని మేళతాళాలతో ఊరేగింపుగా తెచ్చి ఎడ్ల బండిలో ఆశీనులను చేశారు. అనంతరం గ్రామ పురవీధుల గుండా ఆలయాలు సందర్శిస్తూ బస్వేశ్వరస్వామి ఆలయాన్ని చేరుకున్నారు. ఆలయ సన్నిధిలో రాతిగుండులో వెలసిన బస్వేశ్వరునికి అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా ఆదోని మండలం దనాపురం గ్రామానికి చెందిన కోరి శెట్టప్ప కుటుంబ సభ్యులు విచ్చేసిన భక్తులకు అందరికీ అన్నదానం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని