logo

గడప గడపకూ భగీరధుడు

గ్రామాల్లో ఇంకా మినరల్‌ నీరు తాగుతున్న వారిలో మార్పు తెచ్చేందుకూ అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. మిషన్‌ భగీరథ ద్వారా అందించే నీటిలో ఉండే లవణాలు, మినరల్‌ వాటర్‌లో ఉండే వాటిలోని

Published : 18 Jan 2022 01:47 IST

పల్లె చెంతకు ఇంజినీర్లు

నల్లాల వద్ద నీటి సరఫరాను పరిశీలిస్తున్న అధికారులు

* గ్రామాల్లో ఇంకా మినరల్‌ నీరు తాగుతున్న వారిలో మార్పు తెచ్చేందుకూ అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. మిషన్‌ భగీరథ ద్వారా అందించే నీటిలో ఉండే లవణాలు, మినరల్‌ వాటర్‌లో ఉండే వాటిలోని వ్యత్యాసాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. దీనికిగాను నీటి పరీక్ష కేంద్రం సిబ్బంది అక్కడికక్కడే అవగాహన కల్పిస్తున్నారు. నీరు కలుషితమైందా.. లేదా.. అనే విషయాలను వెల్లడిస్తున్నారు. సాధ్యమైనంత వరకు ఆర్వో ప్లాంట్ల నీటిని తాగొద్దని ప్రజలకు సూచిస్తున్నారు.

* పైపులైన్‌ లీకేజీలు, వాల్వుల పనితీరు, సిమెంటు రహదారులపై ఏర్పడిన గుంతల పునరుద్ధరణ, పైపులైన్‌ నుంచి నల్లా కనెక్షన్‌ వద్ద ఫ్లో కంట్రోల్‌ వాల్వులు సరిచేయడం, ఉపరితల ట్యాంకులకు ప్రధాన పైపుల ద్వారా నీటి సరఫరా, పైపులైన్‌ నుంచి బల్క్‌వాటర్‌ సరఫరా తీరు వంటి వాటిని పరిశీలిస్తున్నారు.

న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ (వ్యవసాయం)

వచ్చే వేసవి నాటికి ప్రతి మనిషి గొంతు తడపడానికి మిషన్‌ భగీరథ అధికారులు ఇప్పట్నుంచే చర్యలు ప్రారంభించారు. వేసవిలో తలెత్తే సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు గ్రామాల్లో తిరుగుతున్నారు. ఏఈ స్థాయి అధికారి మొదలు ఎస్‌ఈ వరకు ఇల్లిల్లు చుట్టేస్తున్నారు. పల్లెల్లోని ప్రజాప్రతినిధులతోపాటు తిరుగుతున్నారు. వారు చెబుతున్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. అపరిష్కృతంగా ఉన్న, ఆర్థికపరమైన పనులను వచ్చే మార్చిలోపు పూర్తి చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. వంద రోజులపాటు అధికారులంతా ప్రజల చెంతనే ఉండి నీటి సరఫరాను పరిశీలించనున్నారు.

ఆకస్మిక తనిఖీలు..

ఇప్పటికే క్రాష్‌ ప్రోగాం మొదలైంది. అధికారులు ఏ గ్రామంలో ఉన్నారు. ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో ఎలాంటివి ఉన్నాయి.. పరిశీలిస్తున్నాం. ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తున్న విషయాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నాం. ఇప్పటి వరకు 32 ఆవాసల పరిశీలన పూర్తి చేశాం. ఇంజినీర్లు ఇచ్చిన నివేదికల ఆధారంగా పనులను విభజించి వాటి ప్రాధాన్యాన్ని గుర్తించి పూర్తి చేస్తాం.

- వెంకటరమణ, ఎస్‌ఈ, మిషన్‌ భగీరథ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని