logo

నిలిచిన రాకపోకలు

సరళాసాగర్‌ జలాశయం ఆటోమేటిక్‌ సైఫన్‌ కవాటాలు మంగళవారం మధ్యాహ్నం తెరుచుకోవడంతో వరద నీరంతా ఊకచెట్టు వాగులోకి భారీగా వచ్చి చేరింది. వరద ఉద్ధృతి ధాటికి మదనాపురం, ఆత్మకూర్‌ ప్రధాన రహదారిపై

Published : 10 Aug 2022 05:39 IST

మదనాపురం, ఆత్మకూర్‌ మధ్య ఉన్న వంతెనపై పారుతున్న సరళాసాగర్‌ నీరు

మదనాపురం, న్యూస్‌టుడే : సరళాసాగర్‌ జలాశయం ఆటోమేటిక్‌ సైఫన్‌ కవాటాలు మంగళవారం మధ్యాహ్నం తెరుచుకోవడంతో వరద నీరంతా ఊకచెట్టు వాగులోకి భారీగా వచ్చి చేరింది. వరద ఉద్ధృతి ధాటికి మదనాపురం, ఆత్మకూర్‌ ప్రధాన రహదారిపై మదనాపురం రైల్వేగేటు సమీపంలో ఉన్న లోలెవల్‌(కాజ్‌ వే) వంతెనపైన నీరు భారీగా పొంగడంతో వివిధ మండలాలకు, వివిధ గ్రామాలకు సుమారుగా గంటన్నర పైగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాగు వద్ద పరిస్థితిని తహసీల్దార్‌ నరేందర్‌, ఏఎస్సై గోపాల్‌రెడ్డి పర్యవేక్షించారు. వాగుపై వాహనాలు వెళ్లకుండా తగిన చర్యలు తీసుకున్నారు. వాగు వద్ద పరిస్థితిని గమనించిన మరికొందరు వాహనదారులు రామన్‌పాడ్‌ ప్రాజెక్టు మీదుగా కొత్తకోట, ఆత్మకూర్‌, వివిధ మండలాలకు, ఇతర ప్రాంతాలకు చేరుకున్నారు. అనంతరం ఊకచెట్టు వాగు మీదుగా వరద నీరు రామన్‌పాడ్‌ జలాశయంలోకి చేరాయి. క్రమంగా నీటి నిల్వలు తగ్గడంతో రాకపోకలు యాధావిధిగా కొనసాగుతున్నాయి. ఊకచెట్టు వాగుపై వంతెన నిర్మాణానికి 2017లో ప్రభుత్వం నిధులు రూ.9.25 కోట్లు మంజూరు చేసింది. గుత్తేదారు పనులు ప్రారంభించి అర్థాంతరంగా నిలిపివేయడంతో ఈ దుస్థితి నెలకొందని ప్రయాణికులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు గుత్తేదారుపై చర్యలు తీసుకోవడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని