logo

అమరచింత పోయి.. దేవరకద్ర వచ్చే !

2009లో దేవరకద్ర కొత్త నియోజకవర్గంగా ఆవిర్భవించింది. శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా అమరచింత నియోజకవర్గంలోని చిన్నచింతకుంట...

Published : 08 Nov 2023 04:54 IST

కొత్తకోట, న్యూస్‌టుడే : 2009లో దేవరకద్ర కొత్త నియోజకవర్గంగా ఆవిర్భవించింది. శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా అమరచింత నియోజకవర్గంలోని చిన్నచింతకుంట, దేవరకద్ర మండలాలను, వనపర్తి నియోజకవర్గంలోని కొత్తకోట మండలాన్ని, వనపర్తి, మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలోని అడ్డాకుల మండలాన్ని, మహబూబ్‌నగర్‌, జడ్చర్ల నియోజకవర్గంలోని భూత్పూర్‌ మండలంతో దేవరకద్ర కొత్త నియోజకవర్గంగా ఏర్పడింది. ఐదు మండలాలతో భిన్న సంస్కృతులు ఉన్న నియోజకవర్గంగా ఏర్పాటైంది. అమరచింత నియోజకవర్గంలోని మిగిలిన నర్వ, అమరచింత, ఆత్మకూరు మండలాలను మక్తల్‌ నియోజకవర్గంలో కలిపారు, ధన్వాడ మండలాన్ని కొత్తగా ఏర్పడిన నారాయణపేట నియోజకవర్గంలో కలిపి అమరచింత నియోజవర్గాన్ని రద్దు చేశారు.


ఐదు మండలాలు..  వంద గ్రామాలు

దు మండలాల పరిధిలో మొత్తం 100 గ్రామాలున్న నియోజకవర్గంలో 1.87లక్షల మంది ఓటర్లతో తొలిసారిగా 2009లో ఎన్నికలు జరిగాయి. తెదేపా తరఫున (తెరాస, తెదేపా పొత్తు) పోటీ చేసిన నాటి జడ్పీ ఛైర్‌ పర్సన్‌ సీతాదయాకర్‌రెడ్డి 19,036 ఓట్లతో కాంగ్రెస్‌ అభ్యర్థి స్వర్ణ సుధాకర్‌రెడ్డిపై విజయం సాధించారు.


కొత్త జిల్లాలు.. మండలాలు

కొత్తగా ఏర్పడిన జిల్లాలతో నియోజకవర్గం రెండు జిల్లాల పరిధిలోకి వెళ్లింది. దేవరకద్ర, చిన్నచింతకుంట, భూత్పూర్‌, అడ్డాకుల మండలాలు పూర్వ మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలోనే ఉండి పోగా, కొత్తకోట మండలం వనపర్తి జిల్లా పరిధిలోకి వెళ్లింది. కొత్త మండలాల ఏర్పాటులో భాగంగా అడ్డాకుల మండలంలోని సగభాగాన్ని మూసాపేట మండలం, కొత్తకోట మండలంలోని కొన్ని గ్రామాలతో మదనాపురం మండలం చేశారు. ఏడాది క్రితం దేవరకద్ర మండలాన్ని చీలుస్తూ కౌకుంట్ల మండలాన్ని ఏర్పాటు చేశారు. నియోజకవర్గం మొత్తం 8 మండలాలతో విస్తరించగా పరిపాలన వికేంద్రీకరణ సాధ్యమైంది.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని