logo

ప్రధాని మోదీతోనే దేశ రక్షణ, సంక్షేమం

దేశరక్షణ, ప్రజాసంక్షేమం ప్రధాని నరేంద్రమోదీకే సాధ్యమని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు, భాజపా మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం అభ్యర్థి డీకే అరుణ అన్నారు.

Published : 16 Apr 2024 03:19 IST

మాట్లాడుతున్న భాజపా మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ

నారాయణపేట, న్యూస్‌టుడే : దేశరక్షణ, ప్రజాసంక్షేమం ప్రధాని నరేంద్రమోదీకే సాధ్యమని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు, భాజపా మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం అభ్యర్థి డీకే అరుణ అన్నారు. సోమవారం పేట మండలపార్టీ అధ్యక్షుడు సాయిబన్న ఆధ్వర్యంలో సింగారంలో బూత్‌స్థాయిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ దేశ హితం కోసం పనిచేస్తూ అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్‌ను నిలబెడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరాయన్నారు. దశాబ్దాల కాలంగా పరిష్కారానికి నోచని సమస్యలను అవలీలగా పరిష్కరించారన్నారు. 500 ఏళ్లుగా వివాదంలో ఉన్న అయోధ్య సమస్య భాజపా హాయంలో రామాలయం నిర్మించడం ద్వారా పరిష్కారమయ్యిందన్నారు. భాజపాకు 400పైగా ఎంపీˆ స్థానాలు వస్తాయని, అందులో తనను ఒకరిగా గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.  ఎన్నిక కోడ్‌ వస్తుందని తెలిసి అమలుకు సాధ్యంకాని హామీలు ఇచ్చి రైతులను మోసం చేశారన్నారు. మోదీ ప్రభుత్వం  ఎరువులపై రాయితీ ఇస్తోందన్నారు. ఉపాధి కూలీలకు రూ.300 వేతనం పెంచారని, కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద రూ.6వేల సాయం రైతులకు అందిస్తున్నట్లు తెలిపారు. భాజపా రాష్ట్రనాయకులు రతంగ్‌పాండురెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులు, మండల అధ్యక్షుడు సాయిబన్న, సత్యయాదవ్‌, రఘురామయ్యగౌడ్‌, బాల్‌రెడ్డి, నాగిరెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని