logo

వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి చేయాలి

గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు  ప్రోత్సాహం అందించి రైతులను అభివృద్ధి చేయాలని జిల్లా జడ్పీ ఛైర్మన్ లోక్ నాథ్ రెడ్డి కోరారు.

Updated : 16 Apr 2024 14:49 IST

పాన్‌గల్ :  గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు  ప్రోత్సాహం అందించి రైతులను అభివృద్ధి చేయాలని జిల్లా జడ్పీ ఛైర్మన్ లోక్ నాథ్ రెడ్డి కోరారు. మంగళవారం పాన్‌గల్‌ మండల సర్వ సభ్య సమావేశం ఎంపీపీ శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా వివిధ శాఖల అధికారులు తమ నివేదికలను సభకు వివరించారు.  గ్రామాల్లో  సర్పంచ్‌లు లేని కారణంగా ప్రత్యేక అధికారులు వేసవిని దృష్టిలో పెట్టు కొని  క్షేత్ర స్థాయిలో పర్యటన చేసి  తాగు నీటి సమస్య లేకుండా  చూసుకోవాలని సూచించారు. సమావేశంలో  జడ్పీటీసి లక్ష్మి,  వైస్ ఎంపీపీ కవిత, ఎంపీడీవో కోటేశ్వర్, డీటీ అశోక్, ఎంపీవో రఘురాములు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని