logo

ఏం చేశారని భాజపాకు ఓటెయ్యాలి? : ఎంపీ

రైతుల ధాన్యం కేంద్రం కొనుగోలు చేయని, పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వని భాజపాకు ఎందుకు ఓటెయ్యాలని ఎంపీ, భారాస అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నించారు.

Published : 23 Apr 2024 03:57 IST

మాట్లాడుతున్న ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, చిత్రంలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

జడ్చర్ల గ్రామీణం, న్యూస్‌టుడే : రైతుల ధాన్యం కేంద్రం కొనుగోలు చేయని, పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వని భాజపాకు ఎందుకు ఓటెయ్యాలని ఎంపీ, భారాస అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నించారు. జడ్చర్లలో భారాస మండల, పట్టణ స్థాయి ముఖ్య కార్యకర్తలతో సోమవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఆంద్ర, కర్ణాటక ప్రాజెక్టులకు కేంద్రం జాతీయ హోదా ఇచ్చినా తెలంగాణ ప్రాజెక్టులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తే ఆ పార్టీకి, లేదంట భారాసకు ఓటేయాలని ఇంటింటికి తిరిగి చెప్పాలని కార్యకర్తలకు సూచించారు. మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో చేసిన పొరపాట్లను మళ్లీ చేయొద్దన్నారు. పార్టీ మారిన కొందరు నాయకులు తాను భాజపాలో చేరతానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తాను భవిష్యత్తులోనూ భారాసలోనే ఉంటానన్నారు. శ్రీరాముడిని పూజిద్దాం.. భాజపాను తరిమికొడదామని నినాదంతో ప్రచారం చేయాలని కార్యకర్తలను కోరారు. జడ్చర్ల పురపాలిక ఛైర్‌పర్సన్‌ లక్ష్మి, జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ యాదయ్య, పీఏసీఎస్‌ అధ్యక్షుడు కిష్టారం సుదర్శన్‌గౌడ్‌, జీసీసీ మాజీ ఛైర్మన్‌ వాల్యానాయక్‌, గోవర్ధన్‌రెడ్డి, రఘుపతిరెడ్డి, ప్రణిల్‌చందర్‌, దానిష్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని