logo

రూ. 50 కోసం దుకాణాలకు నిప్పు

పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రహరీ పక్కన ఉన్న వీధి వ్యాపారుల షెడ్డులో డబ్బా దుకాణాలు దహనం చేసిన నిందితుడిని గుర్తించి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై గోవర్దన్‌ సోమవారం తెలిపారు.

Published : 30 Apr 2024 05:34 IST

కందనూలు, న్యూస్‌టుడే : పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రహరీ పక్కన ఉన్న వీధి వ్యాపారుల షెడ్డులో డబ్బా దుకాణాలు దహనం చేసిన నిందితుడిని గుర్తించి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై గోవర్దన్‌ సోమవారం తెలిపారు. రాంనగర్‌ కాలనీకి చెందిన అన్వర్‌ మేనమామ ఖాజా ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రహరీ పక్కన ఉన్న వీధి వ్యాపారుల షెడ్డులో ఓ దుకాణం (డబ్బా) ఏర్పాటు చేసుకొని కొబ్బరి బోండాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 22 సోమవారం అన్వర్‌ మేనమామను రూ. 50 ఇవ్వమని అడిగాడు. అతడు ఇవ్వకపోవడంతో ఆవేశంతో అదే రోజు రాత్రి డబ్బాకు నిప్పు అంటించాడు. మంటలు తీవ్రంగా వ్యాపించడంతో ఖాజా డబ్బాతో పాటు పక్కనే ఉన్న మరో మూడు దుకాణాలకు మంటలు వ్యాపించాయి. వాటిలోని సామగ్రి పూర్తిగా దగ్ధం అయ్యాయి. ప్రమాదంలో బాధితులకు రూ.10 లక్షల మేరకు నష్టం వాటిల్లినట్లు పోలీసులు తెలిపారు. అన్వర్‌ డబ్బాకు నిప్పు పెడుతున్న దృశ్యం సీసీ కెమెరాల్లో నమోదు కాగా ఆధారాలు సేకరించి అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.


రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

 అలంపూర్‌చౌరస్తా (ఉండవల్లి), న్యూస్‌టుడే: ద్విచక్రవాహనం రోడ్డు విభాగినిని ఢీకొట్టడంతో ఓ యువకుడు అక్కడిక్కడే మృతిచెందగా మరొకరు గాయపడినట్లు ఎస్సై శ్రీనివాసులు, ఏఎస్సై బీవీ.సుబ్బారెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లికి చెందిన సున్ని ఖాసీంవలీ(19), అమీర్‌తో కలిసి ద్విచక్రవాహనంపై హైదరాబాదులోని ఎల్‌బీనగర్‌లో స్నేహితుడి పెళ్లికి వెళ్లారు. ఆదివారం రాత్రి 10 గంటలకు తిరిగి ఇంటికి బయలుదేరారు. సోమవారం ఉదయం 6 గంటల సమయంలో ఉండవల్లి మండలపరిధి అలంపూర్‌చౌరస్తాలోని జాతీయ రహదారి ఫ్లైఓవర్‌పై అతివేగంతో వెళుతూ ద్విచక్రవాహనం రోడ్డు విభాగినిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో సున్ని ఖాసీంవలీ అక్కడిక్కడే మృతిచెందగా భౌతికకాయాన్ని అంబులెన్సులో అలంపూర్‌ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన అమీర్‌ను జాతీయ రహదారి అంబులెన్సులో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని