logo

తాగునీటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలి

గ్రామాల్లో మిషన్ భగీరథ నీరు పూర్తి స్థాయిలో అందేలా చూడాలని మిషన్ భగీరథ గ్రిడ్ ఎస్ఈ జగన్మోహన్ అన్నారు.

Published : 04 May 2024 17:24 IST

రాజోలి: గ్రామాల్లో మిషన్ భగీరథ నీరు పూర్తి స్థాయిలో అందేలా చూడాలని మిషన్ భగీరథ గ్రిడ్ ఎస్ఈ జగన్మోహన్ అన్నారు. ఆయన శనివారం మండలంలోని పెద్దతాండ్రపాడు, తుమ్మిళ్ల గ్రామాల్లో తాగునీటి పరిస్థితులపై ఆరా తీశారు. పెద్దతాండ్రపాడులో ఎన్ని బోర్లు బాగు చేయించారని, నీరు ఏ విధంగా వదులుతున్నారని కార్యదర్శి మధుసూధన్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ కార్యాలయం సమీపంలోని ప్రైవేటు బోరును లీజ్ తీసుకోవాలని, మిషన్ భగీరథ నీరు సరిపోకపోతే ప్రత్యామ్నాయంగా ఉపయోగించాలని సూచించారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ ఏఈ తేజవర్ధన్ తదితరులున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని