logo

భారాస, భాజపా నిరుపేదల ద్రోహులు

భారాస, భాజపా నాయకులు నిరుపేద ద్రోహులని పాలమూరు కాంగ్రెస్‌ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. చర్లపల్లి, హన్మాన్‌పల్లి, కొండాపూర్‌, కిష్టాపూర్‌, రాంకిష్టాయపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే పర్నికరెడ్డితో కలిసి సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 07 May 2024 03:00 IST

ధన్వాడ, న్యూస్‌టుడే : భారాస, భాజపా నాయకులు నిరుపేద ద్రోహులని పాలమూరు కాంగ్రెస్‌ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. చర్లపల్లి, హన్మాన్‌పల్లి, కొండాపూర్‌, కిష్టాపూర్‌, రాంకిష్టాయపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే పర్నికరెడ్డితో కలిసి సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కిష్టాపూర్‌లో జరిగిన సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పదేళ్లు పాలించిన ఈ పార్టీలు అర్హులైన వారికి రేషన్‌ కార్డులు ఇవ్వలేదని, దాని మూలంగా అర్హత ఉన్నా పింఛన్‌ పొందలేకపోయారని ఆరోపించారు. పదేళ్లుగా వారు చేయలేదని, మూడు నెలల్లోనే కాంగ్రెస్‌ చేయలేదని అనడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. ఒక్కొక్కటిగా ప్రభుత్వం అన్నీ అమలు చేస్తుందని స్పష్టం చేశారు. ఎంపీగా గెలిపిస్తే స్థానికంగా ఉన్న రామసముద్రం చెరువును కృష్ణాజలాలతో నింపే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే పర్నికరెడ్డి మాట్లాడుతూ.. శాసనసభ ఎన్నికల్లో మెజార్టీ ఇవ్వలేదని ఈ సారైనా మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరారు. పార్టీ రాష్ట్ర ఓబీసీ అధ్యక్షుడు వినోద్‌కుమార్‌, జేఏసీ మాజీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, నాయకులు దామోదర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, డీలర్‌ వెంకట్రెడ్డి, జగన్నాథరెడ్డి, భగవంత్‌, రహీమ్‌, నిరంజన్‌రెడ్డి, ఖాదర్‌ పాల్గొన్నారు.  


ధన్వాడ, న్యూస్‌టుడే : ప్రజా సంక్షేమమే కాంగ్రెస్‌ ధ్యేయమని ఆ పార్టీ మహబూబ్‌నగర్‌ లోక్‌సభ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి అన్నారు. రాత్రి మరికల్‌, ధన్వాడ పట్టణాల్లో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో డీసీసీ మాజీ అధ్యక్షుడు శివకుమార్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. శివకుమార్‌రెడ్డి ఉన్నారు.


పాతబస్టాండ్‌(నారాయణపేట) : ముదిరాజ్‌ల బిడ్డనై జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి శివకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పేటలోని సీవీఆర్‌ భవన్‌లో నియోజకవర్గ స్థాయి ముదిరాజ్‌ల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పీసీసీ సభ్యులు సంజీవ్‌ ముదిరాజ్‌, నాగరాజ్‌, నరహరి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని