logo

అప్పుడు అవినీతిపరుడు.. ఇప్పుడు ఆదర్శప్రాయుడా?

కొద్ది నెలల క్రితం రాష్ట్రానికి వచ్చినప్పుడు మాజీ ఐపీఎస్‌ అధికారి అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు రూ. 1.20 కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపిస్తూ.. ఆయన కుమార్తెపై అవినీతి ఆరోపణలు ఉన్నందున వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

Published : 07 May 2024 03:12 IST

కల్వకుర్తి విజయసంకల్ప సభలో తమిళనాడు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై

కల్వకుర్తి పట్టణం, న్యూస్‌టుడే : కొద్ది నెలల క్రితం రాష్ట్రానికి వచ్చినప్పుడు మాజీ ఐపీఎస్‌ అధికారి అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు రూ. 1.20 కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపిస్తూ.. ఆయన కుమార్తెపై అవినీతి ఆరోపణలు ఉన్నందున వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. నెల రోజుల క్రితం అదే మాజీ ఐపీఎస్‌ అధికారి కేసీఆర్‌ అందరికి ఆదర్శప్రాయుడని ఆయన వల్లే అన్నివర్గాల అభ్యున్నతి సాధ్యమైందంటున్నారు.. ఇదెలా సాధ్యం.. ఇలాంటి వారిని ప్రజలు తిరస్కరించాలని తమిళనాడు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలై అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్వకుర్తి పట్టణంలో ఎంపీ అభ్యర్థి భరత్‌ప్రసాద్‌కు మద్దతుగా చేపట్టిన విజయసంకల్ప సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అవకాశాన్ని బట్టి మాట్లాడుతున్నాని విమర్శించారు. మూడు నెలల క్రితం గుజరాత్‌ను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెద్దన్నలాంటి వారని చెప్పిన రేవంత్‌రెడ్డి నేడు ఎన్నికల ప్రచారంలో నిందిస్తుండటం సరికాదన్నారు. రాహుల్‌ గాంధీ నియోజకవర్గాలు మార్చుతూ ఎన్నికల బరిలో ఉంటుండగా రేవంత్‌ కూడా పార్టీలు మారి ముఖ్యమంత్రి అయ్యారని విమర్శించారు. మోదీ దేశంలోని వెనుకబడిన జిల్లాలను ఎంపిక చేసుకున్నారని  మూడోసారి ప్రధాని అయ్యాక వాటిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. అందులో భాగంగా 25 ఏళ్లు పాటు ప్రజలకు సేవచేయగలిగేలా యువకునికి టికెట్ ఇచ్చి ప్రజల ముందుకు పంపారన్నారు. నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ అభ్యర్థిగా సామాజిక స్పృహ, బాధ్యతగల భరత్‌ను బరిలో నిలిపారని ఆయనను గెలిపించాలన్నారు. అనంతరం ఎంపీ రాములు, జాతీయ బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు ఆచారి, ఎంపీ అభ్యర్థి భరత్‌ ప్రసాద్‌ ప్రసంగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని