logo

22 రోజులు ఉత్కంఠ తప్పదు

ఎంపీగా గెలిచేందుకు అన్ని పార్టీల అభ్యర్థులు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పోటాపోటీగా సభలు, సమావేశాలు, రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారం చేస్తూ.. తీరిక లేకుండా గడుపుతున్నారు.

Published : 09 May 2024 05:55 IST

న్యూస్‌టుడే, గద్వాల న్యూటౌన్‌: ఎంపీగా గెలిచేందుకు అన్ని పార్టీల అభ్యర్థులు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పోటాపోటీగా సభలు, సమావేశాలు, రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారం చేస్తూ.. తీరిక లేకుండా గడుపుతున్నారు. వీరి హామీలు, పాలన నచ్చిన ఓటర్లు మే 13వ తేదీన ఓటు హక్కు వినియోగించుకుంటారు. దీంతో ఓటర్ల పని పూర్తవుతుంది. నాయకులకు మాత్రం ఆ మరుసటి రోజు నుంచి ఉత్కంఠ మొదలవుతుంది. 22 రోజుల వరకు ఇది తప్పదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం జూన్‌ 4వ తేదీన ఫలితాలు వెల్లడించనుంది. అప్పటి వరకు నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో నామినేషన్‌ వేసిన 50 మంది అభ్యర్థులు అభ్యర్థులు ప్రతి రోజూ పోలింగ్‌ సరళిపై క్షేత్ర స్థాయి సమాచారం సేకరిస్తూ గెలుపోటములపై అంచనాలు వేసుకోక తప్పదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని