logo

పాలమూరు ఎత్తిపోతల పూర్తికి కృషి : వంశీచంద్‌రెడ్డి

కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని ఆ పార్టీ మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందుకు ప్రజలు పూర్తి మద్దతు ఇవ్వాలని కోరారు.

Published : 09 May 2024 05:56 IST

హన్వాడలో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌ వ్యవసాయం, న్యూస్‌టుడే : కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని ఆ పార్టీ మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందుకు ప్రజలు పూర్తి మద్దతు ఇవ్వాలని కోరారు. బుధవారం రాత్రి హన్వాడ, మహబూబ్‌నగర్‌లోని తెలంగాణ చౌరస్తాలో నిర్వహించిన కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే మరింత అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పారు. లోక్‌సభ ఎన్నికలను ప్రజలు సీరియస్‌గా తీసుకోవాలన్నారు. మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సాగునీటిని అందించే బాధ్యత తాను తీసుకుంటానని వంశీచంద్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం కల్పిస్తామన్నారు. ప్రతి తండాకు రోడ్లు నిర్మిస్తామని, అర్హులందరికీ ఇళ్లు ఇస్తామని చెప్పారు. భారాస, భాజపా నాయకులు మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాను అభివృద్ధి చేసుకుందామని, ఇందుకు ఆయనకు అండగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నాయకులు వంశీచంద్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ శ్రీకాంత్‌గౌడ్‌, నాయకులు ఎన్‌పీ వెంకటేశ్‌, ఏపీ మిథున్‌కుమార్‌రెడ్డి, సీరాజ్‌ ఖాద్రి, సుధాకర్‌రెడ్డి, మహేందర్‌, కృష్ణయ్య, నవనీత పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు