logo

వర్షంతో చల్లబడిన వాతావరణం

జిల్లాలో బుధవారం అర్ధరాత్రి, గురువారం సాయంత్రం ఓ మోస్తారుగా వర్షం కురిసింది.

Published : 09 May 2024 19:22 IST

రాజోలి: జిల్లాలో బుధవారం అర్ధరాత్రి, గురువారం సాయంత్రం ఓ మోస్తారుగా వర్షం కురిసింది. కొన్ని రోజులుగా భరించలేని ఎండలతో ప్రజలు ఇబ్బందులు పడగా, ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా వాతావరణం ఒక్క సారిగా చల్లబడింది. అయిజ మండలం చిన్నతాండ్రపాడులో 67.5 మి.మీ, గద్వాలలో 48.5, ధరూర్ మండలం ద్యాగదొడ్డిలో 32.8, ఇటిక్యాల మండలం బీచుపల్లిలో 21, కేటీదొడ్డిలో 10 మి.మీ. రాజోలిలో 15 మి.మీ. వర్షం కురిసింది. దీని ఫలితంగా మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రత తక్కువగా నమోదైంది. వడ్డేపల్లిలో 41.2 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతనే అత్యధికంగా ఉంది. ధరూర్, కేటీదొడ్డి మండలాలు ఆరెంజ్ అలెర్ట్‌ ఉండగా, మిగిలిన మండలాలన్నీ తక్కువ తీవ్రత ఉండే ఎల్లో అలెర్ట్‌లోకి వెళ్లాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని