logo

అక్షింతల రాజకీయం చేస్తున్న భాజపాకు బుద్ధి చెప్పాలి: జూపల్లి

లోక్‌సభ ఎన్నికల్లో భాజపా రాముడి అంక్షితల పేరిట రాజకీయం చేస్తోందని ఈనెల 13న జరగనున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

Published : 10 May 2024 03:53 IST

 వంగూరులో రోడోషోలో మాట్లాడుతున్న మంత్రి జూపల్లి కృష్ణారావు, పక్కన ఎంపీ అభ్యర్థి మల్లు రవి సతీమణి రాజబన్సీదేవి

వంగూరు, న్యూస్‌టుడే : లోక్‌సభ ఎన్నికల్లో భాజపా రాముడి అంక్షితల పేరిట రాజకీయం చేస్తోందని ఈనెల 13న జరగనున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి మల్లు రవిని గెలిపించాలని కోరుతూ.. ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలో ఎన్నికల రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి మల్లు రవిని 2లక్షల మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ, ఎంపీ అభ్యర్థి మల్లు రవి సతీమణి రాజబన్సీదేవి,  జడ్పీ ఉపాధ్యక్షుడు బాలాజీసింగ్‌, జడ్పీటీసీ సభ్యుడు కేవీఎన్‌రెడ్డి, మండలాధ్యక్షుడు పండిత్‌రావు, నాయకులు పాల్గొన్నారు.

పదేళ్లలో భారాస రూ.8లక్షల కోట్ల అప్పులు

 చారకొండ (వెల్దండ గ్రామీణం), న్యూస్‌టుడే :   భారాస పదేళ్ల పాలనలో రూ.8లక్షల కోట్ల అప్పులు చేసిందని ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. మండల కేంద్రంలో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి మల్లు రవికి మద్దతుగా ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఎంపీ అభ్యర్థి సతీమణి రాజబన్సీదేవితో కలిసి గురువారం రోడ్‌షో నిర్వహించారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని